మహేంద్ర సింగ్ ధోనీ భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్. భారత మాజీ కెప్టెన్ ధోనీ ఆల్ టైమ్ బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక వికెట్ల వెనుక మహీ చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రాంచీ డైనమైట్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇక, ధోని స్టంపింగ్ ల స్టైలే వేరు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ధోని మొత్తం 195 స్టంపింగ్‌లు చేశాడు. ఇది ప్రపంచ రికార్డు. (AFP)
ధోని వికెట్ల వెనుక స్టంపింగ్ చేయడంలో సూపర్ ఫాస్ట్ గా ఉండేవాడు. వన్డేల్లో 123 మంది, టీ20ల్లో 34 మంది, టెస్టుల్లో 38 మంది ఆటగాళ్లు ధోని స్టంపింగ్ ద్వారా పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం ధోనీ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డుకు దరిదాపుల్లో మరే కీపర్ లేడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 139 స్టంపింగ్‌లతో (టెస్ట్, వన్డే మరియు టీ20) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.(AFP)
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ ఆటకు రారాజు. సచిన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌కు 100 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అంత ఈజీ కాదు. (AFP)
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు 71 సెంచరీలు ఉండగా.. రన్ మెషీన్‌గా పిలువబడే విరాట్ కోహ్లీ 70 సెంచరీలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ దేవుడి రికార్డును విరాట్ బ్రేక్ చేస్తాడని మూడేళ్ల క్రితం వరకు అందరూ చెప్పేవారు. అయితే గత కొంత కాలంగా.. కోహ్లీ 70 అంతర్జాతీయ సెంచరీలతో దగ్గరే ఆగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. (AFP)
ప్రపంచ క్రికెట్లో హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ విధ్వంసకర ఓపెనర్లలో ఒకడు. ఓపెనర్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 35 ఏళ్ల రోహిత్ వన్డే మ్యాచులో 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 8 ఏళ్ల క్రితం శ్రీలంకపై 173 బంతుల్లో రోహిత్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. రోహిత్ రికార్డును ఏ ఆటగాడు బద్దలు కొట్టలేడు. (AFP)
వన్డేల్లో రోహిత్ శర్మ మూడుసార్లు డబుల్ సెంచరీ సాధించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్. ఈ మారథాన్ ఇన్నింగ్స్‌లో రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 4 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు, అతని క్యాచ్‌ను శ్రీలంక ఫీల్డర్లు జారవిడిచారు. ఆ తర్వాత మరో 260 పరుగులు జోడించాడు. (AFP)
భారత క్రికెట్ జట్టుకు గోడగా నిలిచిన రాహుల్ ద్రవిడ్ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 16 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ద్రవిడ్ అత్యధిక బంతులు ఎదుర్కొన్నాడు మరియు ఎక్కువ సమయం క్రీజులో గడిపాడు. ద్రవిడ్ కు బౌలింగ్ చేయడం బౌలర్లకు చాలా కష్టమైంది. ద్రవిడ్ తన టెస్టు కెరీర్లో మొత్తం 31,258 బంతులు ఎదుర్కొన్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ అతనే. (AFP)
భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కేవలం 164 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్ తన టెస్టు కెరీర్లో మొత్తం 29,437 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో ద్రవిడ్ క్రీజులో మొత్తం 44,152 నిమిషాలు గడిపాడు. అంటే అతను దాదాపు 736 గంటల పాటు క్రీజులో నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. (AFP)
1964 జనవరి 12న మద్రాస్‌లో (ప్రస్తుతం చెన్నై) జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై (ఇండియా vs ఇంగ్లండ్) వరుసగా 21 మెయిడిన్లు బౌలింగ్ చేశాడు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో అతనికి ఎలాంటి వికెట్ దక్కలేదు. అతను కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాదకర్ణి 32 ఓవర్ల బౌలింగ్‌లో 27 ఓవర్లు మెయిడిన్లు వేశాడు మరియు 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని బౌలింగ్ ఎకానమీ 0.15. ఇప్పుడు బహుశా ఒక బౌలర్ ఈ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే. (BCCI)