IPL 2022 Final in Photos: ఆరంభమే అదుర్స్.. గుజరాత్ గెలుపును ఫోటోల్లో చూసేయండి..
IPL 2022 Final in Photos: ఆరంభమే అదుర్స్.. గుజరాత్ గెలుపును ఫోటోల్లో చూసేయండి..
IPL 2022 Final in Photos: రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 15వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్.. అదే ఊపులో కప్పుకొట్టేసింది. ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్‌కు నిరాశ ఎదురైంది.
ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో.. లక్షలాది ప్రేక్షుకుల మధ్య.. ఐపీఎల్ నయా ఛాంపియన్ గా గుజరాత్ టైటాన్స్ నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. (BCCI Photo)
2/ 18
ఫైనల్ కు ముందు రణవీర్ సింగ్, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్ ల ప్రత్యేక ప్రదర్శన హైలెట్ గా నిలిచింది. (BCCI Photo)
3/ 18
ఇక, మెగాఫైట్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. (BCCI Photo)
4/ 18
జాతీయ గీతం జనగణమన ఆలాపనతో ఫైనల్ ప్రారంభమైంది. జాతీయ గీతం కోసం రెండు జట్లు లైనప్ అయినప్పుడు తీసిన ఫోటో..(BCCI Photo)
5/ 18
రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఒక ఫోర్, రెండు సిక్సర్లతో మంచి టచ్ లో కన్పించాడు. కానీ 16 బంతుల్లో 22 పరుగులు చేసిన తర్వాత నాలుగో ఓవర్ లో ఔటై.. పెవిలియన్ బాట పట్టాడు.(BCCI Photo)
6/ 18
కెప్టెన్ సంజూ శాంసన్, టాప్ ప్లేయర్ జోస్ బట్లర్ రాజస్తాన్ ఇన్నింగ్స్ నిలబెడుతున్న సమయంలో ప్రత్యర్ధి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఆర్ఆర్ ను దెబ్బతీశాడు. తన కౌంటర్ పార్ట్ సంజూను ఔట్ చేసి.. గుజరాత్ ను రేసులో నిలిపాడు. (BCCI Photo)
7/ 18
బట్లర్ మరోసారి రాజస్తాన్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. 34 బంతుల్లో 39 పరుగులు చేసిన బట్లర్ ను హార్ధిక్ పాండ్యా అద్భుత డెలివరీతో పెవిలియన్ బాట పట్టించాడు. (BCCI Photo)
8/ 18
రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ లో సరియైన భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమైంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఆ జట్టును వరుస విరామాల్లో దెబ్బ తీస్తూనే ఉన్నారు. (BCCI Photo)
9/ 18
హార్ధిక్ మూడు, సాయి కిషోర్ రెండు, షమీ, రషీద్, యష్ దయాల్ తలా ఓ వికెట్ దక్కించుకోవడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. (BCCI Photo)
10/ 18
ఇన్నింగ్స్ బ్రేక్ మధ్య అహ్మదాబాద్ స్టేడియంలోని లైట్ షో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. (BCCI Photo)
11/ 18
అక్షయ్ కుమార్, సౌరవ్ గంగూలీ మరియు రణవీర్ సింగ్ వంటి స్టార్ సెలబ్రిటీలు ఐపీఎల్ పైనల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. (BCCI Photo)
12/ 18
131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ కు వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్ ల రూపంలో ఆదిలోనే షాకులు తగిలాయ్. రాజస్తాన్ బౌలర్లు తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.(BCCI Photo)
13/ 18
అయితే.. కష్టాల్లో పడ్డ గుజరాత్ ఇన్నింగ్స్ ను గిల్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఆదుకున్నారు. వీరిద్దరూ చూడచక్కని షాట్లతో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించారు.(BCCI Photo)
14/ 18
ఇక, చాహల్ అద్భుత బంతితో 63 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. పాండ్యా 34 పరుగులు చేసి ఫస్ట్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.(BCCI Photo)
15/ 18
హార్ధిక్ వికెట్ కోల్పోయినా.. గుజరాత్ టైటాన్స్ కి మరో సాలిడ్ పార్టనర్ షిప్ లభించింది. గిల్, మిల్లర్ ఈ ఇద్దరూ అద్భుతంగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.(BCCI Photo)
16/ 18
ఆఖర్లో నాలుగు పరుగులు అవసరమనప్పుడు.. 19 ఓవర్ లో మొదటి బంతికే సిక్సర్ బాది.. గుజరాత్ కి అపరూప విజయాన్ని కట్టబెట్టాడు గిల్. దీంతో, అరంగేట్ర సీజన్ లో నయా ఛాంపియన్ గా అవతరించింది గుజరాత్ టైటాన్స్.(BCCI Photo)
17/ 18
విజయం తర్వాత గుజరాత్ ఆటగాళ్లు ఎమోషనల్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.(BCCI Photo)
18/ 18
. లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్.. అదే ఊపులో కప్పుకొట్టేసింది. ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్‌కు నిరాశ ఎదురైంది.