అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఏడాది గడిచినా.. ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత దేశంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడు మహీనే. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీ నికర ఆదాయం 2021 మార్చి నాటికి 110 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 826 కోట్లు.
2014, 15లో ఫోర్ట్స్ టాప్ 100 అథ్లెట్స్ జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక ఇండియన్ ధోనీ. ఇక, అంతర్జాతీయ కెరీర్లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్లలో 1600 పరుగుల బాదాడు.