కొన్ని రోజులుగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్పేరు మీడియాలో మారుమోగుతోంది. రెజ్లర్ వినేశ్ ఫోగాట్తో పాటు పలువురు రెజ్లర్లు కూడా అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిన్న ఈ ఫెడరేషన్ కార్యకలాపాలను కేంద్రం రద్దు చేసింది. అటు ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమార్ను కూడా సస్పెండ్ చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా భారత రెజర్లు గత వారం రోడ్డెక్కారు. ఢిల్లిలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా,సాక్షి మాలిక్, సరితా మోర్ సంగీతా ఫొగట్తో పాటు ఇంకా చాలా మంది రెజ్లర్లు నిరసనకు దిగారు. రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు.