2015లో టీ20 రైల్వేస్ టీమ్ తరఫున అరంగ్రేటం చేశాడు. మధ్యప్రదేశ్ రంజీ టీమ్ (Rajni team)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో మధ్యప్రదేశ్ టీమ్‌కు ఆడి మంచి ప్రతిభ కనపరిచాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare trophy)లో అయితే రికార్డు కూడా నెలకొల్పాడు. కేవలం 146 బంతుల్లోనే 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 198 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.
‘‘నేను చిన్నతనంలో కుడి చేతితో బ్యాటింగ్ చేసేవాడిని. కానీ, సౌరవ్ గంగూలీకి వీరాభిమానిని. ఆయన ఎలా సిక్సర్లు కొట్టాడో.. అలాగే నేను బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాను. దాదా నా జీవితంలో తెలియకుండానే చాలా పెద్ద పాత్ర పోషించాడు. నేను నిజంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా” అని తన మనసులో మాటను వెల్లడించాడు.