టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన భార్య అయేషా ముఖర్జీ (Aesha Mukherjee)తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు గబ్బర్. ఆదివారం శిఖర్ ధావన్ తన 36వ పుట్టినరోజు వేడుకలు చేసుకోనున్నాడు. దీంతో సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ పెళ్లి మరోసారి జోరుగా చర్చ నడుస్తోంది.
శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీకి అప్పటికే పెళ్లై, విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకుని 10 ఏళ్లు ఒంటరిగా జీవించిన తర్వాత అయేషా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు గబ్బర్. ఆంగ్లో ఇండియన్ అయిన అయేషా తండ్రి బెంగాళీ, ఆమె తల్లి బ్రిటన్ దేశస్థురాలు. అయేషా కుటుంబం మొత్తం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. అయేషా కూడా అక్కడే పుట్టి పెరిగింది.
అయేషా ముఖర్జీ వివాహం, విడాకులు, పిల్లల గురించి పూర్తిగా తెలుసుకున్న శిఖర్ ధావన్, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ పెళ్లికి శిఖర్ ధావన్ కుటుంబీకులు అంగీకరించలేదు.మరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... శిఖర్ ధావన్ కంటే అయేషా ముఖర్జీ వయసులో ఏకంగా 10 ఏళ్లు పెద్దది కూడా. ధావన్ ప్రేమకి అతని కుటుంబంలో ఎవ్వరూ అంగీకరించకపోయినా, అతని తల్లి మాత్రం కొడుకు ప్రేమను అర్థం చేసుకుంది.