Home » photogallery » sports »

HBD MS DHONI FROM CHILDHOOD FRIENDS TO LIFE PARTNERS A LOOK BACK AT FORMER TEAM INDIA SKIPPERS UNTOLD LOVE STORY WITH SAKSHI SRD

HBD MS Dhoni : సాక్షిని ప్రేమలో పడేయడానికి ధోనీ ఇన్ని తిప్పలు పడ్డాడా..? వాటే ఏ లవ్ స్టోరీ....

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు క్రికెట్ అందించిన ఓ గొప్ప నాయకుడు. దాదాపు 16 ఏళ్లు టీమిండియాకు విశేషసేవలందించిన ధోనీ..గతేడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో కూడా చెరగని ముద్ర వేశాడు. ధోనీకి ముందు.. ధోనీ తర్వాత అనేలా టీమిండియా క్రికెట్ రూపురేఖలు మార్చాడు. అలాంటి ధోనీ 40వ పడిలో అడుగుపెట్టాడు. క్రికెట్ లో మిస్టర్ కూల్ గా పేరొందిన ధోనీకి రియల్ లైఫ్ లో ఓ క్యూట్ లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ.. అతని భార్య సాక్షి సింగ్ తోనే. సాక్షి ప్రేమను దక్కించుకోవడానకి మహీ ఎన్నో తిప్పలు పడ్డాడట. ధోనీ బర్త్ డే సందర్భంగా అతని లవ్ స్టోరీపై ఓ లుక్కేద్దాం.