IND vs AUS : సూపర్ డెసిషన్ తో కివీస్ కు చెక్ పెట్టిన మాస్టర్ మైండ్.. ఆ విషయంలో ధోనికి ఏ మాత్రం తీసిపోడు
IND vs AUS : సూపర్ డెసిషన్ తో కివీస్ కు చెక్ పెట్టిన మాస్టర్ మైండ్.. ఆ విషయంలో ధోనికి ఏ మాత్రం తీసిపోడు
IND vs AUS : ఫైనల్లో పాక్ చివరి 6 బంతులకు 13 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఆఖరి ఓవర్ విషయంలో ధోని తీసుకున్న నిర్ణయం ఆ ఓవర్ ఆరంభానికి ముందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
2007 టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో టీమిండియా (Team India) విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ లు ఫైనల్ కు చేరుకున్నాయి.
2/ 8
ఫైనల్లో పాక్ చివరి 6 బంతులకు 13 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఆఖరి ఓవర్ విషయంలో ధోని తీసుకున్న నిర్ణయం ఆ ఓవర్ ఆరంభానికి ముందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
3/ 8
జోగిందర్ శర్మకు ఆఖరి ఓవర్ వేయాల్సిందిగా ధోని బంతిని ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. మూడు బంతుల తర్వాత భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక అక్కడి నుంచి ధోని కెప్టెన్సీకి తిరుగు లేకుండా పోయింది.
4/ 8
ప్రస్తుతం ధోనిలాంటి ఆలోచనలతోనే కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూసుకెళ్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ లో గుజరాత్ కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ తన టీంను చాంపియన్ గా నిలబెట్టాడు.
5/ 8
కెప్టెన్సీ గురించి ధోని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్లు చెప్పే హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం వాటిని చక్కగా అమలు చేస్తున్నాడు. తాజాగా మరోసారి సూపర్ డెసిషన్ తో డిసైడర్ లో టీమిండియాను గెలిపించి భారత్ కు సిరీస్ ను అందజేశాడు.
6/ 8
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టి20లో టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ స్థానంలో ఎవరు ఉన్నా ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్లేమో. కారణం అడిగితే డ్యూ ఫ్యాక్టర్ అని చెప్పేవాళ్లు. కానీ, హార్దిక్ మాత్రం రొటీన్ కు భిన్నంగా చేశాడు.
7/ 8
బ్యాటింగ్ ఎంచుకోవడం.. భారీ స్కోరును చేయడం.. ఆ తర్వాత అద్భుత బౌలింగ్ తో కివీస్ ను కేవలం 66 పరుగలకే కుప్పకూల్సి భారీ తన కెప్టెన్సీలో భారీ విజయాన్ని అందుకున్నాడు.
8/ 8
ఇక శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఆఖరి ఓవర్ ను అక్షర్ పటేల్ తో వేయించి భారత్ ను గెలిపించాడు. గౌతం గంభీర్ లాంటి ప్లేయర్లు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు కూడా. అయితే వీటిని పట్టించుకోని హార్దిక్ భారత్ జట్టుకు వరుస పెట్టి సిరీస్ లను అందజేస్తున్నాడు.