టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఆటకు అల్విదా ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మరిచిపోలేని అనుభూతులు పొందానని, దానికి కారణమైన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు. (Image Credit : Instagram)
హర్భజన్ సింగ్ ముద్దుపేరు 'భజ్జీ'. సహచరుడు నయన్ మోంగియా హర్భజన్ పేరు పలకడం కష్టంగా భావించి.. అతడికి భజ్జీ అనే పేరు పెట్టాడు. అయితే ఆ తర్వాత భజ్జీ అనే పేరు చాలా పాపులర్ అవ్వడం వల్ల.. ఆ పేరుతో 2009లో పేటెంట్ హక్కులను పొందాడు హర్భజన్. ఆ తర్వాత భజ్జీ అనే పేరుతో స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ను స్థాపించాడు. (Image Credit : Instagram)
2001లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక సిరీస్ తర్వాత హర్భజన్ సింగ్‌కు 2002లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పోలీస్‌లో DSP పదవిని ఆఫర్ చేశారు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లో ఒక హ్యాట్రిక్ సహా 32 వికెట్లు పడగొట్టాడు. అయితే, క్రికెట్ పై అతడి ఉన్న నిబద్ధత కారణంగా హర్భజన్ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. (Image Credit : Instagram)