ఇవాళ 2011 క్రికెట్ ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ పుట్టినరోజు. 12 డిసెంబర్ 1981లో జన్మించిన ఈ సూపర్ స్టార్ ఆటగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రపంచకప్ విజయాలను భారత అభిమానులకు అందించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో అరంగేట్రం చేసిన తర్వాత.. యువరాజ్ భారత జట్టు మిడిల్ ఆర్డర్‌కు ప్రాణం పోశాడు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. (PC-yuvisofficial)
2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. అలాగే అతను కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 30 బంతుల్లో 5 సిక్సర్లతో 70 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన 4 ఏళ్ల తర్వాత భారత ఉపఖండంలో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఆడినప్పుడు యువరాజ్ సింగ్ ఆల్ రౌండర్ ఆట కారణంగానే 28 సంవత్సరాల తర్వాత ఈ టోర్నీని భారత్ గెలుచుకుంది. ఈ టోర్నీలోనూ యువీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది. టోర్నీలో యువీ 90కి పైగా సగటుతో 362 పరుగులు చేశాడు. అలాగే తన పేరిట 15 వికెట్లు తీశాడు. ఈ టోర్నీ ఆడుతున్నప్పుడు అతను క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే ఆ విషయం ఎవరికీ తెలియజెప్పలేదు. అతను బంతితో బ్యాట్‌తో భారత జట్టుకు వాయిస్తూ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు.
యువరాజ్ సింగ్ 2015లో బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ని వివాహం చేసుకున్నాడు. యువీ సిక్కు అయితే, హాజెల్ క్రిస్టియన్. హాజెల్ ఇంగ్లండ్ లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ప్రసిద్ధ చిత్రం హ్యారీ పోటర్ సిరీస్‌లోని మూడు చిత్రాలలో హాజెల్ పని చేసిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సల్మాన్ ఖాన్ చిత్రం బాడీగార్డ్ నుండి హాజెల్ మొదట గుర్తింపు పొందింది. అంతకు ముందు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నది.