మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు క్రికెట్ అందించిన ఓ గొప్ప నాయకుడు. దాదాపు 16 ఏళ్లు టీమిండియాకు విశేషసేవలందించిన ధోనీ..గతేడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో కూడా చెరగని ముద్ర వేశాడు. ధోనీకి ముందు.. ధోనీ తర్వాత అనేలా టీమిండియా క్రికెట్ రూపురేఖలు మార్చాడు. అలాంటి ధోనీ 40వ పడిలో అడుగుపెట్టాడు. మిస్టర్ కూల్ ధోనీకి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. భార్య సాక్షి, కూతురు జీవాలంటే ధోనీకి ప్రాణం. తన రెండు కళ్ల లాంటి సాక్షి, జీవాలతో అరుదైన పిక్స్ పై ఓ లుక్కేద్దాం. (Photo Credit : Instagram)