మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు క్రికెట్ అందించిన ఓ గొప్ప నాయకుడు. దాదాపు 16 ఏళ్లు టీమిండియాకు విశేషసేవలందించిన ధోనీ..గతేడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో మిస్టర్ కూల్ గా పేరొందిన ధోనీకి రియల్ లైఫ్ లో ఓ క్యూట్ లవ్ స్టోరీ ఉంది. (Photo Credit : Instagram)
అప్పుడు ఆమెను తన బైక్పై ఇంటి దగ్గర దిగబెట్టేందుకు వెళ్లిన మహేంద్రుడు, సాక్షికి తన లవ్ మ్యాటర్ చెప్పాడట. సాక్షి అతని ప్రేమను అంగీకరించడానికి కూడా చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు సాక్షి, మనోడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూలై 4, 2010లో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. పెళ్లైన తర్వాత ధోనీకి సంబంధించిన చాలా విషయాల్లో సాక్షి కేర్ తీసుకోవడం మొదలెట్టింది. (Photo Credit : Instagram)
ధోనీ..సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా మిస్టర్ కూల్ ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంటోంది. అంతే గాక సాక్షి ముక్కుసూటి తత్వం కల మనిషి. ఓసారి ధోనీ, తన కాళ్లకు చెప్పులు తొడుగుతున్న ఫోటోలను కూడా పోస్టు చేసిన సాక్షి సింగ్... "చెప్పులు ఎవరు కొనిస్తారో, వాళ్లే వెయ్యాలి..." అంటూ కాప్షన్ ఇచ్చింది.(Photo Credit : Instagram)
ఇక, వీరిద్దరి అన్యోన్యతకు గుర్తుగా జీవా పుట్టింది. జీవా పుట్టిన తర్వాత.. వారిద్దరి లోకం ఆ చిన్నారి తల్లినే. గ్రౌండ్ లో ప్రత్యర్ధుల్ని దడదడలాడించే ధోనీ మేటి నాయకుడిగా పేరు ప్రఖ్యాత్యులు సంపాందించాడు. అయితే, ఇంట్లో మాత్రం సాక్షి సింగ్ కెప్టెన్సీలోనే ధోనీ ప్రయాణం సాగిపోతుంది. (Photo Credit : Instagram)