ఒకప్పుడు బాక్సింగ్ కేవలం పురుషులకే పరిమితమై ఉండేది. కాలం మారేకొద్దీ ఈ రంగంలో కూడా మహిళల ప్రవేశించడం మాత్రమే కాదు ఆ రంగంలో తమ సత్తాను చాటుకుంటున్నారు. బంగారు పతకాలతో దేశప్రతిష్టను పెంచుతున్నారు. ఈ లిస్ట్ లో మొదట మనకు గుర్తొచ్చేది మేరీ కోమ్. ఈ మణిపూర్ మణిపూస 39 వ ఏటలోకి అడుగుపెట్టింది. మేరీ కోమ్ ముగ్గురుపిల్లల తల్లి, రాజకీయ వేత్త. అయితేనేం తనకు వయసు, పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఇవేవీ అడ్డురాలేదు.
మేరీకోమ్ 1983, మార్చి 1న మణిపూర్‌లోని ఖంగతిరూరల్లో జన్మించింది . 5.2 మీటర్ల ఎత్తు 48కిలోల బరువుతో బాక్సింగ్ క్రీడారంగంలో అదరగొడుతోంది. ఆమె నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు మాంగ్తెటోన్పాకోమ్, తల్లి మాంగ్తె అకమ్కోమ్. వ్యవసాయం వీరి జీవనో పాధి. మేరీకోమ్ చిన్నతనం నుంచే తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. స్కూల్ జీవితంలోనే అథ్లెటిక్స్, బాక్సింగ్ నేర్చుకుంది. అయితే మేరీకోమ్ తండ్రి యువకుడిగా ఉన్నప్పుడు కుస్తీక్రీడను ఆడేవారు. మేరీకోమ్ తన ఇంట్లో ఆమెనే పెద్దది. ఆమెకు ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. తండ్రి బాటలో ఆమె పయనించసాగారు.
కోమ్ చదువంతా మైరింగ్లోని క్రిస్టియన్ హైస్కూల్లో సాగింది. హైస్కూల్ చదివే సమయంలోనే 400మీటర్ల రన్నింగ్, జావలింగ్ వంటి క్రీడల్లో రాణించేవారు. ఆమె సొంత ఊరికి చెందిన వ్యక్తికి 1998లో బ్యాంకాంగ్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడంతో వీరి ఊర్లో అనేకుల యువతకు ఒక ప్రోత్సాహం లభించినట్లుగా అయ్యింది. మేరీకోమ్ కూడా అతనిని స్ఫూర్తిగా తీసుకున్నారు. తొమ్మిది, పదోతరగతి ఇంపాల్‌కు వెళ్లి అక్కడ చదివారు. ఇంపాల్లోనే హైస్కూల్‌తోపాటు గ్రాడ్యూ యేషన్ వరకు చదువ్ఞకున్నారు. హైస్కూల్ చదువ్ఞకునే సమయంలోనే బాక్సింగ్, రన్నింగ్‌లలో రాణించసాగారు. కె.కోసన మైథీ అనే కోచ్ వద్ద శిక్షణ పొందారు. అనంతరం ఆమె ఇంపాల్లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరారు.
అక్కడే ఆమె బాక్సింగ్‌లో కఠోరమైన శిక్షణను పొందా రు. తండ్రి కుస్తీపోటీదారుడు కావడంతో మేరీకోమ్‌ను కూడా తండ్రి బాక్సింగ్‌లో ప్రోత్సహించారు. 2000లో మేరీకోమ్ బాక్సింగ్‌లో చాంపియన్‌షిప్ పొందగా, ఆమె ఫొటో న్యూస్పేపర్లలో వచ్చింది. 21 సంవత్సరాల వయసులో మేరీకోమ్ బాక్సింగ్ క్రీడనే తన ఊపిరిగా భావించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేం దుకు ప్రయత్నించారు. 2008లో ఆసియాక్రీడలో ఉమెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను పొందారు. 2009లో వియత్నాంలో జరిగిన ఆసియాక్రీడలో బంగారుపతకాన్ని సాధించారు. అలాగే 2010లో కిజికిస్థాన్‌లో జరిగిన ఆసియా మహిళా బాక్సింగ్‌లో చాంపియన్‌షిప్‌ను పొందారు. 2011లో చైనాలో జరిగిన ఆసియా ఉమెన్కప్లో కూడా బంగారుపతకాన్ని పొందారు.
2010లో కామన్వెల్త్లో పాల్గొని బంగారుపతకాన్ని కైవసం చేసుకున్నారు. 2014లో ఆసియాక్రీడలో సౌత్‌కొరియా క్రీడాకారిని ఓడించి, పతకాన్ని పొందారు. 2018లో జరిగిన కామన్వెల్త్ పోటీలో బంగారు పతకాన్ని పొందారు. అదేవిధంగా 2012లో ఒలింపిక్స్ క్రీడలో పాల్గొన్ని గెలుపొందారు. ఇలా ఎక్కడ పోటీచేసినా గెలుపొందడమే తన నైజంగా మలచుకున్న మేరీకోమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.