భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు, 2022 సంవత్సరం అతని కెరీర్లో అత్యంత ముఖ్యమైన సంవత్సరం. ఈ ఏడాది ప్రారంభంలో పాండ్యా కెప్టెన్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ను ఐపిఎల్ ఛాంపియన్‌గా చేశాడు. దీంతో పాటు భారత క్రికెట్ జట్టులో అద్భుతంగా పునరాగమనం చేశాడు. అయితే తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన హార్దిక్.. ఐపీఎల్ వేలంలో ఒకప్పుడు పదిలక్షలకు కూడా అమ్ముడు పోలేదు. (Hardik Pandya Instagram)
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఒకరైన హార్దిక్ పాండ్యాను గుజరాజ్ టైటాన్స్ ఈ ఏడాది రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు, హార్దిక్ ముంబై ఇండియన్స్‌తో చాలా కాలం పాటు అనుబంధం కలిగి ఉన్నాడు. గతేడాది వరకు ముంబై ఇండియన్స్ హార్దిక్ కు ఏటా రూ.11 కోట్లు చెల్లించింది. (Hardik Pandya Instagram)
హార్దిక్ పాండ్యాను వెలుగులోకి తెచ్చి అతని ప్రదర్శనను మెరుగుపరిచిన ఘనత ముంబై ఇండియన్స్‌కు చెందుతుంది. దేశవాళీ క్రికెట్లో పాండ్యాను ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసింది ముంబై ఇండియన్స్ జట్టే. ఇతర ఫ్రాంచైజీలకు అతని గురించి తెలియనప్పుడు IPL వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2015లో హార్దిక్ పాండ్యా తన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. (Hardik Pandya Instagram)
2015లో, హార్దిక్ పాండ్యాపై ఒకే ఒక్క బిడ్ వేయబడింది. అతను రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత హార్దిక్ వెనుదిరిగి చూడలేదు. అయితే 2014లో హార్దిక్ పాండ్యాపై ఒక్క బిడ్ కూడా రాలేదన్న సంగతి తెలిసిందే. అప్పుడు హార్దిక్ గురించి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. (Hardik Pandya Instagram)
హార్దిక్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. హార్దిక్ 11 టెస్టులు, 66 వన్డేలు, 73 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 532 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్లో పాండ్యా 1386 పరుగులు చేసి 63 వికెట్లు పడగొట్టాడు. టీ20లో హార్దిక్ 989 పరుగులు, 54 వికెట్లు సాధించాడు. (Hardik Pandya Instagram)
హార్దిక్ పాండ్యా 2016 ఐపీఎల్లో కూడా 10 లక్షల మాత్రమే వేతనంగా అందుకున్నాడు. ఆ సమయంలో 10 లక్షలు సంపాదించడం తనకు బాగానే ఉందని పాండ్యా చెప్పాడు. ఆ టైంలో అతని సోదరుడు కృనాల్ పాండ్యా 2 కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే, ఇప్పుడు హార్దిక్ ఓ విలువైన ఆటగాడు. ఐపీఎల్ మాత్రమే కాకుండా పలు బ్రాండ్ల ద్వారా కూడా కోట్లు వెనకేస్తున్నాడు. (Hardik Pandya Instagram)