డానిష్ కనేరియా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అతని అంతర్జాతీయ క్రికెట్ ముగిసింది. 2012లో డేనిష్ కనేరియా తన సహచర క్రికెటర్లతో కలసి స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపిస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. ఆ సమయంలో కనేరియా ఎసెక్స్ కౌంటీలో భాగంగా ఉండేవాడు.