మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ క్వార్టర్స్‌లో 9వ వికెట్ పడిన తర్వాత విహారి బ్యాటింగ్‌కు దిగడం చూసి అటు ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లే కాదు.. ప్రేక్షకులు షాక్ అయ్యారు. అంతకుముందు తొలి రోజే అవేష్ ఖాన్ బౌలింగ్‌లో విహారి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత స్కానింగ్‌లో మణికట్టు విరిగినట్లు తేలింది. అప్పటికే విహారి 16 పరుగులతో ఉన్నాడు. Image Source Twitter/CricCrazyJohns
రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విహారి మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి అందరికి షాక్‌కు గురి చేశాడు. ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి పదో వికెట్‌కు విలువైన పరుగులు జోడించాడు. దీంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ లో 379 పరుగులు చేయగా.. తర్వాత మధ్యప్రదేశ్ 228 రన్స్‌కు ఆలౌటైంది. Image Source Twitter/circleofcricket
అయితే రెండో ఇన్నింగ్స్ లో ఆంధ్ర టాపార్డర్ విఫలమవడంతో.. విహారి మరోసారి చివరి వికెట్‌గా క్రీజులో అడుగుపెట్టి ఆకట్టుకున్నాడు. ఒంటి చేత్తోనే ఆడుతూ 16 బంతులు ఎదుర్కొన్న విహారి 15 రన్స్ చేశాడు. అందులో మూడు ఫోర్లు కూడా ఉన్నాయి. ఇందులో అతను ఒంటిచేత్తో కొట్టిన రివర్స్ స్వీప్ షాట్ కూడా ఉండటంతో అందరూ నోరెళ్లబెట్టారు. Image Source Twitter/ESPNcricinfo
అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేని ఆంధ్ర జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలి విహారి పోరాటానికి అర్ధం లేకుండా చేసింది. సీజన్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర టీమ్ మధ్యప్రదేశ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. Image Source Twitter/lal__kal
ఇక తాను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడంతో మధ్యప్రదేశ్ టీమ్ ప్లేయర్లు ఆశ్చర్యపోయారన్నాడు విహారి. దెబ్బ తగిలిన రోజు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకున్నానని చెప్పిన విహారి.. ఆ రోజు అసలు నిద్ర పట్టలేదన్నాడు. టీమ్ గెలుపు కోసం తాను ఎంతవరకైనా పోరాడతాని చెప్పాడు విహారి. Image Source Twitter/lal__kal