పీవీ సింధుకు గవర్నర్ తమిళిసై విందు.. మ్యాటర్ ఏంటంటే..?

పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో లంచ్ చేశారు పీవీ సింధు. అనంతరం రాజ్‌భవన్‌లో జరగనున్న మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పీవీ సింధును ఆహ్వానించారు గవర్నర్.