జోహన్నస్బర్గ్ తో పాటు కేప్‌టౌన్ టెస్టులను గెలిచి సిరీస్ ను 2-1తో గెలుచుకుంది. అయితే ఈ సిరీస్ లో భారత బ్యాటింగ్ పేలవంగా కన్పించింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) లేని లోటు స్పష్టంగా కన్పించింది. దీంతో, రోహిత్ శర్మ ఎప్పుడెప్పుడు జట్టులోకి ఎంట్రీ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సౌతాఫ్రికా పర్యటనకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. అతని తొడ కండరాలు పట్టేశాయి. నిజానికి ఈ గాయం రోహిత్‌శర్మకు గతంలో కూడా ఉంది. ఆ తర్వాత కోలుకోని మళ్లీ మ్యాచ్‌లు ఆడి సత్తా చాటాడు. కానీ సౌతాఫ్రికా పర్యటన కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హిట్‌మ్యాన్‌కు తొడ కండరాల గాయం మళ్లీ తిరగబెట్టింది.
బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రోహిత్ శర్మకు నేడు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సత్తా చాటిన రోహిత్ తన ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి రన్నింగ్‌తో పాటు ఇతరత్రా వాటిలో కూడా రోహిత్ శర్మ పాసయ్యాడు. దీంతో రోహిత్ శర్మకు అధికారులు ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు.