బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మధ్య ఇటీవల జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని.. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాల్లో మిగిలిన ఐపీఎల్ 2021 మ్యాచులను సక్సెస్ చేస్తామని ఓ బీసీసీఐ అధికారి ఏఎన్ఐకి తెలిపారు. యూఏఈలో మ్యాచులను విజయవంతంగా నిర్వహిస్తామన్న విశ్వాసం బీసీసీఐలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. చాలా వరకూ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా రాకపోతే అప్పుడు చూస్తామని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. అయితే, ఐపీఎల్ పాల్గొనని ఆటగాళ్ల జీతంలో కోత పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది.