దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా (Team India) పరిస్థితి అంతగా బాగాలేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి సిరీస్ లో 2-0తో వెనుకబడి ఉంది. ఇక మంగళవారం జరిగే మూడో టి20లోనూ భారత్ ఓడితే సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు ఉండగానే ప్రత్యర్థికి అప్పగించవలసి వచ్చింది. Team India (PC : BCCI)
[caption id="attachment_1324830" align="alignnone" width="751"] టీమిండియా పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్లు సెటర్లు విసురుతున్న వేళ.. ఒక మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ () మాత్రం టీంలోని ఒక పాజిటివిటీని గమనించాడు. అదే ఇషాన్ కిషన్.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ రూ. 15.25 కోట్ల భారీ ధర పలికిన సంగతి తెలిసిందే.
" రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చినా ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలి. రోహిత్.. కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించి, రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. ఎందుకుంటే ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై కిషన్ ఆద్భుతంగా ఆడగలడు" అని గంభీర్ పేర్కొన్నాడు.