రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తరఫున బరిలోకి దిగిన అతడు ఫినిషర్ రోల్ లో మెరిశాడు. 183 స్ట్రయిక్ రేట్ తో సూపర్ స్ట్రయికర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్ కు చేరుకుందంటే అందుకు ముఖ్య కారణం దినేశ్ కార్తీక్. ఆ ప్రదర్శన ద్వారానే దక్షిణాఫ్రికా సిరీస్ కు ఎంపికయ్యాడు.
"ప్రస్తుతం ఏదైనా చెప్పడం చాలా తొందరవుతోంది. ఎందుకంటే T20 ప్రపంచ కప్ కు ఇంకా చాలా సమయం ఉంది అప్పటి వరకు కార్తీక్ ఇదే ఫాంలో రాణించాల్సి ఉంటుంది. అతను చివరి 3 ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేయాలనుకుంటే, పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే, బౌలింగ్, బౌలింగ్ లో సత్తా చాటగల ప్లేయర్ అవసరం. అందువల్ల అక్షర్ పటేల్ మంచి ఎంపిక' అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ పాయింట్ లో అన్నాడు.
'నేను అయితే కార్తీక్‌ను జట్టులోకి తీసుకోను. జట్టులో రిషబ్ పంత్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లు ఉన్నారు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు మళ్లీ జట్టులోకి వస్తే కార్తీక్ జట్టులో స్థానం నిలుపుకోవడం కష్టమే. అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించలేకపోతే జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదు' అని గంభీర్ అన్నాడు.