ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) లీగ్ స్టేజీ తుది అంకానికి చేరుకుంది. ఐపీఎల్ 2022 లీగ్ రౌండ్లో ఇంకా 7 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 10 జట్లు ఉండటంతో ఈసారి మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. లీగ్ చివరి మ్యాచ్ మే 22న జరగనుంది. నాకౌట్ రౌండ్ మ్యాచులు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయి. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ సీజన్లో, కొంతమంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు బంతి మరియు బ్యాట్‌తో మెరిశారు. ఇందులో ఆయుష్ బదోనీ, జితేష్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కానీ, కొందరు యువ ఆటగాళ్లకు తమ ప్రతిభ కనబర్చే అవకాశం రాలేదు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ను 5వ సారి అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన ఆటగాళ్లు ఉన్నారు.
యశ్ ధుల్ (Yash dhull): యశ్ ధుల్ కెప్టెన్సీలో ఈ ఏడాది వెస్టిండీస్ లో జరిగిన అండర్ -19 ప్రపంచకప్ టోర్నీని భారత్ కైవసం చేసుకుంది. టోర్నీలో కెప్టెన్సీతో పాటు ధూల్ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాడు. కరోనా కారణంగా యశ్ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ అతను 76 సగటుతో 229 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన తర్వాత, IPL 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు యశ్ ధుల్ ని కొనుగోలు చేసింది. కానీ లీగ్ దశలో 12 మ్యాచ్‌లు ముగిసినా ధుల్‌కు ఆడే అవకాశం రాలేదు. అతని సీజన్ కేవలం బెంచ్ మీద కూర్చుని గడిచిపోయింది. (Yash dhull Instagram)
రాజ్వర్ధన్ హంగర్గేకర్ (Rajvardhan Hangargekar): భారత్ ను అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో ఈ ఆల్‌రౌండర్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో రాజవర్ధన్ 52 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. IPL 2022 మెగా వేలంలో.. చెన్నై సూపర్ కింగ్స్ రాజవర్ధన్‌ను బేస్ ధర 30 లక్షలకు 5 రెట్లు చెల్లించి రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఇక, అతనికి చోటు దక్కడం కష్టమే. (Rajvardhan Hangargekar Instagram)
రాజ్ బావా (Raj angad bawa) : ఈ 19 ఏళ్ల ఆల్ రౌండర్ అండర్-19 ప్రపంచకప్‌లో 252 పరుగులతో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనను చూసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో పంజాబ్ నుంచి వస్తున్న ఈ ఆటగాడిపై బెట్టింగ్ ఆడి బేస్ ధర 20 లక్షల కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లించి రూ.2 కోట్లుకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో పంజాబ్ తరఫున రెండు మ్యాచుల్లో బరిలోకి దిగాడు. ఒక మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయిన రాజ్ మరో మ్యాచ్‌లో 11 పరుగులు చేశాడు. (Raj angad bawa Instagram)
విక్కీ ఓస్త్వాల్ (Vicky ostwal): ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధికంగా 12 వికెట్లు పడగొట్టాడు. IPL 2022 మెగా వేలంలో, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ బౌలర్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, అక్షర్ పటేల్ ఉండటంతో ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ ఆటగాడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. (Vicky ostwal Instagram)