Team India : అల ఇంగ్లండ్ లో... కోహ్లీ తనయ వామిక నుంచి రోహిత్ కుమార్తె సమైరా వరకు..

Team India : టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. WTC Final మరియు ఆ తర్వాత ఇంగ్లండ్ టీమ్ పై ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టింది కోహ్లీసేన. ఇక, ఈ పర్యటనలో భారత ఆటగాళ్ళు తమ కుటుంబాలతో కలిసి వెళ్లారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానె, అశ్విన్, ఛతేశ్వర్ పూజారాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత చాలా బిజీగా ఉన్న ఆటగాళ్ళు తండ్రులుగా మారారు. ఇంగ్లండ్ లో పిల్లలతో సరదాగా గడుపుతున్న టీమిండియా క్రికెటర్లపై ఓ లుక్కేద్దామా..