మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. క్రికెట్ ఫ్యాన్స్‌లో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఉంటారు. ఈ రోజుల్లో క్రికెటర్లు ఆటతో పాటు ఫిట్నెస్, అందంపైన కూడా శ్రద్ధ పెడుతున్నారు. బాలీవుడ్ హీరోల కంటే మంచి గుర్తింపు తెచ్చుకొని ఫ్యాషన్ మ్యాగజైన్లను సైతం ఆకర్షిస్తున్నారు. గతంలో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటివారు మంచి స్టైలిష్ క్రికెటర్లుగా గుర్తింపు సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెటర్లలో టాప్- 10 హ్యాండ్సమ్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
1. విరాట్ కోహ్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని టాప్ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు సాధించాడు. ఆటతో పాటు అందమైన క్రికెటర్ల జాబితాలోనూ అతడు టాప్ ప్లేస్‌లో ఉంటాడు. స్కోరు బోర్డు రికార్డులతో పాటు సంపాదనలో సైతం కోహ్లీ రికార్డులు సాధిస్తున్నాడు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే కెప్టెన్‌కు కోట్ల సంఖ్యలో మహిళా అభిమానులు ఉన్నారు. అనుష్క శర్మతో పెళ్లి తరువాత కూడా ఈ ఫ్యాషన్ ఐకాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించిన అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ల జాబితాలో ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే కావడం విశేషం.
2. కేఎల్ రాహుల్ : కేఎల్ రాహుల్ సైతం చూడటానికి విరాట్ కోహ్లీ మాదిరిగానే కనిపిస్తాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆటలో రాటుదేలుతున్న రాహుల్‌కు లేడీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. హాట్ లుక్స్‌తో ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. 27 ఏళ్ల ఈ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం విరాట్ కోహ్లీతో పాటు పూమా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. రెడ్ బుల్, రాయల్ స్టాగ్ వంటి బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాడు.
3. శుభ్‌మన్ గిల్ : ఈ యుంగ్ క్రికెటర్‌కు యూత్‌లో ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. 19 ఏళ్ల ఈ హ్యాండ్సమ్ ఓపెనర్ 2019 ఐపీఎల్లో బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికైన అతి తక్కువ సమయంలోనే శుభ్‌మన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు పెరగడం విశేషం. అతడి ఇన్‌స్టా పోస్ట్‌లకు యువతులు పెట్టే కామెంట్లను చూస్తే.. గిల్‌కు వారిలో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌కు గిల్‌పై క్రష్ ఉందనే వార్తలు వినిపించాయి. సచిన్ కూతురు సారా టెండూల్స్తో గిల్ ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
4. పాట్ కమిన్స్ : ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఈ తరం అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ స్పోర్ట్స్‌స్టార్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. పబ్లిక్ అప్పీయరెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కమిన్స్‌ను.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అతడు ప్రస్తుతం రెబెక్కా బోస్టన్ అనే ఇంటీరియర్ డిజైనర్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ సిడ్నీలో కలిసి నివసిస్తున్నారు.
5. ఫాఫ్ డు ప్లెసిస్ : దక్షిణాఫ్రికా కెప్టెన్ అయిన డు ప్లెసిస్‌కు స్వదేశంలో భారీ సంఖ్యలో మహిళా అభిమానులు ఉన్నారు. ఆకర్షణీయమైన లుక్స్, అందమైన రూపంతో అతడు మహిళల్లో బాగా పాపులర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా, అంతర్జాతీయ బ్రాండ్లు అతడితో ఒప్పందాలు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన తరువాత అతడికి భారత్‌లోనూ ప్రజాదరణ పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి పది లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రికెటర్‌కు పెళ్లయింది. 2017లో అతడికి పాప పుట్టింది.
6. జాసన్ రాయ్ : అత్యంత స్టైలిష్ క్రికెటర్లలో ఒకరైన జాసన్ రాయ్ సైతం హాట్ క్రికెటర్లలో ఒకరిగా మారారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఈ 28 ఏళ్ల యువకుడు.. ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌లో కీ ప్లేయర్. ఆటతో పాటు ఆకర్షణీయమైన రూపంతో ఎంతోమంది ఉమెన్ ఫ్యాన్స్‌కు క్రష్‌గా మారాడు రాయ్. డిఫరెంట్ హెయిర్స్టైలింగ్పై ఆసక్తి చూపే ఈ బ్యాట్స్‌మెన్‌కు పెళ్లయింది. 2019లో అతడు తండ్రయ్యాడు.
7. మనీష్ పాండే : భారత క్రికెట్లో మరో అట్రాక్టివ్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే. ఈ క్లాసీ బ్యాట్స్‌మెన్ తరచూ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. సినిమా హీరోలకు తీసిపోని బాడీ బిల్డింగ్, అందమైన రూపంతో భారీ సంఖ్యలో ఉమెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. అతడి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మంచి స్టైలిష్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు. బెంగళూరు టైమ్స్ నిర్వహించిన సర్వేలో.. బెంగళూరులో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 14వ స్థానంలో నిలిచాడు ఈ 29 ఏళ్ల క్రికెటర్.
8. షోయబ్ మాలిక్ : పాకిస్థాన్ క్రికెట్ జట్టులో పాతుకుపోయిన షోయబ్ మాలిక్‌కు భారీ ఉమెన్ ఫ్యాన్ బేస్ ఉంది. భారత్, పాక్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడు, షోయబ్ మాలిక్ ఇండియన్ యాడ్స్‌లో కూడా కనిపించేవాడు. మైదానంలో, బయట వివాదాలకు దూరంగా ఉండే ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్‌కు పాకిస్థాన్‌తో పాటు భారత్‌లోనూ అభిమానులు ఉన్నారు. 2010లో అతడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక మగబిడ్డ పుట్టాడు.