భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. ఐదేళ్ల క్రితం విరాట్ కోహ్లీ బ్యాట్ బౌలర్లపై విరుచుకుపడేది. అతని పరుగుల వేట ముందు పెద్ద పెద్ద బౌలర్లు కూడా బెంబేలెత్తిపోయేవారు. ముఖ్యంగా 2016 మరియు 2019 మధ్య విరాట్ కోహ్లీ చాలా పరుగులతో పాటు సెంచరీలు చేశాడు. ఇక, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి టెస్టు క్రికెట్లో అద్వితీయమైన రికార్డు ఉంది. విరాట్ కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. భవిష్యత్తులో ఏ కెప్టెన్‌కి ఈ రికార్డు చేయడం అంత ఈజీ కాదు.(PC-AFP)
మార్క్ బౌచర్ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్. ఈ మాజీ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ అనేక రికార్డులు సృష్టించినప్పటికీ.. ఓ రికార్డు ఉంది. ఇది.. క్రికెట్ ఆడుతున్న ప్రస్తుత ఏ వికెట్ కీపర్ కూడా ఆ రికార్డును బద్దలు కొట్టలేడు. మార్క్ బౌచర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. టెస్ట్ క్రికెట్లో.. బౌచర్ వికెట్ల వెనుక మొత్తం 555 మందిని ఔట్ చేశాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో బౌచర్ మొత్తం 999 మందిని ఔట్ చేశాడు. (PC-AFP)
రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రికీ కెప్టెన్సీలో 2003, 2007లో ఆస్ట్రేలియా ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది ఆస్ట్రేలియా జట్టు. పాంటింగ్ నాయకత్వంలో ఆస్ట్రేలియన్ జట్టు టెస్టు క్రికెట్లో చాలా ఏళ్లు తిరుగులేని టీమ్ గా అవతరించింది. ఇక, పాంటింగ్ ఆటగాడిగా 108 టెస్టు మ్యాచ్‌లు గెలిచాడు. ఈ రికార్డును ఏ ఆటగాడు బద్దలు కొట్టడం అంత సులభం కాదు. (PC-AFP)
శ్రీలంక దిగ్గజాలు కుమార సంగక్కర, మహేల జయవర్ధనేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నారంటే ప్రత్యర్ధి జట్లు మ్యాచ్ మీద ఆశలు వదులుకునేవారు. ఈ ఇద్దరు దిగ్గజాలకు మూడో వికెట్ కు సంబంధించి ఓ ప్రపంచ రికార్డు ఉంది. సంగక్కర మరియు జయవర్ధనే 2006లో కొలంబో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 624 పరుగుల భాగస్వామ్యం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గత 15 ఏళ్లుగా ఈ రికార్డును ఏ బ్యాటర్లు కూడా చేరుకోలేదు. (PC-AFP)
భారత క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ 1996 నుంచి 2012 వరకు తన అద్భుతమైన ఆటతో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. అతడిని టీమిండియా వాల్ అనేవారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ద్రావిడ్ ఒక ఎండ్ లో గోడలా నిలిచేవాడు. ఫీల్డర్‌గా, టెస్ట్ క్రికెట్లో 210 క్యాచ్‌లు తీసుకున్నాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్ధనే ఈ రికార్డుకు చేరువైనప్పటికీ దానిని బద్దలు కొట్టలేకపోయాడు. టెస్టుల్లో జయవర్ధనే పేరిట మొత్తం 205 క్యాచ్‌లు నమోదయ్యాయి. (PC-AFP)
టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రతికూల వాతావరణం లేదా డేంజరస్ వికెట్ల కారణంగా మ్యాచ్ ముందుగానే ముగిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి టెస్టు మ్యాచ్‌ను కేవలం ఆరు గంటల్లోపే ముగించిన సందర్భం ఉంది. 1932లో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 5 గంటల 53 నిమిషాల్లో దక్షిణాఫ్రికా (ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా) జట్టును ఓడించింది. క్రికెట్లో అతి తక్కువ సమయంలో ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది. ఆ తర్వాత ప్రోటీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 45 పరుగులకు ఆలౌట్ అయింది. (PC-AFP)
పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ హనీఫ్ మహ్మద్ పేరిట టెస్టు క్రికెట్లో అద్వితీయమైన రికార్డు ఉంది. జనవరి 1958లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హనీఫ్ క్రీజులో 16 గంటలకు పైగా గడిపి మ్యాచ్‌ను డ్రా చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఈ లిటిల్ మాస్టర్ యొక్క ఈ అద్భుతమైన రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. (PC-AFP)
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్ లో 1000 వికెట్లకు పైగా సాధించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అత్యధికంగా 800 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మురళీధరన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు కానీ అతను ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. మురళీధరన్ పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును ఏ బౌలర్ బ్రేక్ చేయడం అసాధ్యం. (afp)
1990ల్లో అందరూ బ్రియానా లారా ఆట గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఈ మాజీ వెస్టిండీస్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ క్రీజులో నిలిచాడంటే ఏ జట్టుకైనా వణుకు పుట్టాల్సిందే. ఇక, ఏప్రిల్ 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన ఆంటిగ్వా టెస్టులో అజేయంగా 400 పరుగులు చేశాడు. లారా పేరిట ఉన్న ఈ రికార్డు 18 ఏళ్లుగా తిరుగులేనిది. లారా అంతకుముందు 1994లో ఇంగ్లండ్‌పై 375 పరుగులు చేశాడు.. ఆ తర్వాత 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్ బ్రేక్ చేశాడు. (PC-AFP)
ఆస్ట్రేలియా యొక్క గొప్ప బ్యాట్స్‌మెన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్ క్రికెట్ సగటు 99.94. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక సగటు. డాన్ చివరి ఇన్నింగ్స్‌లో 0 పరుగులకే ఔటయ్యాడు. దీంతో.. కేవలం 4 పరుగుల తేడాతో 100 సగటును కోల్పోయాడు. ఆల్-టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ అయిన బ్రాడ్ మాన్ ఈ అద్భుత రికార్డు దరిదాపుల్లో ఎవరూ లేరు. (PC-AFP)