షాహిద్ ఆఫ్రిదీ: రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కివస్తూ సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ. తన కెరీర్‌లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్ వెళ్లిన ఆఫ్రిదీ, అక్కడ మరో క్రికెటర్‌తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ దొరికిపోయాడు. సెక్స్ స్కాండిల్‌లో దొరికిన ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్ట్రోఫీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు.
షేన్ వార్న్ పేరు చెబితే చాలు.. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ ఎందరో గజగజ వణికేవారు. ఆయన చేతి నుంచి మెలికలు తిరుగుతూ వచ్చిన బంతి... బ్యాట్స్‌మెన్ వెనకాల నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసిన సందర్భాలు కోకొల్లలు. ప్రపంచ మేటి స్పిన్నర్ గా పేరు పొందిన షేన్ వార్న్.. తన కెరీర్ లోనూ పలు వివాదాలకు కేంద్ర బింధువయ్యాడు. అతను హాంప్‌షైర్‌లో ఉన్నప్పుడు కొందరు మోడళ్లతో సరసాలాడటం, తరువాత మెల్బోర్న్ పలువురిని లైంగికంగా వేధించారని ఆరోపణలున్నాయి. అంతేగాక ఒకసారి యాషెస్ సిరీస్ లో భాగంగా.. బ్రిటిష్ నర్సును లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి.
క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరు సర్ ఇయాన్ బోథమ్. మైదానంలో ఈ దిగ్గజ ఆటగాడు క్రికెట్ ను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లాడు. అయితే, మైదానం బయట ఎంతో అపకీర్తిని సంపాదించాడు. తనపై పూర్తి నమ్మకం ఉంచిన భార్యను మోసం చేశాడు. బోథమ్‌కు ఆస్ట్రేలియన్ వెయిట్రెస్‌తో కూడా ఎఫైర్ ఉంది. అయితే, మాజీ మిస్ బార్బడోస్ లిండీ ఫీల్డ్‌తో అతని సంబంధం 1980లలో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది.
హమీజా ముఖ్తార్ అనే మహిళ.. మీడియా సమావేశంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆజం తన బాయ్ ఫ్రెండ్, స్కూల్ మేట్ అని ఆరోపించింది. ప్రేమ పేరుతో లైంగిక అవసరాలు తీర్చుకున్నాడని బాబర్ పై సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే హింసిస్తున్నాడని తెలిపింది. అతను క్రికెటర్ గా ఎదిగే క్రమంలో లక్షల రూపాయలు ఖర్చు చేశానని ఆమె వెల్లడించింది.
మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ మేనల్లుడు పాక్ పేసర్ ఇమామ్-ఉల్-హక్ అనేక మంది మహిళలను మోసం చేసి దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రికెటర్ వాట్సాప్ సందేశాల స్క్రీన్షాట్లను బాధితులు బయటపెట్టడంతో మనోడి వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఈ యంగ్ క్రికెటర్ ఏకంగా 8 మంది అమ్మాయిల్ని మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయ్.
షాహీన్ అఫ్రిదిపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అతను ఒకేసారి చాలా మంది అమ్మాయిలతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ను ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. షాహీన్ ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్‌ను ఓ బాధితురాలు పోస్ట్ చేసింది. ఫరీహా అనే అమ్మాయి షాహిన్ అఫ్రిదీపై సంచలన ఆరోపణలు చేసింది. అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో అఫ్రిది ముందుంటాడని ఆమె ఆరోపించింది.
న్యూజిలాండ్‌లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన డారిల్ టఫీ.. ఓ సేల్స్ వుమెన్ తో చేసిన శృంగారం వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోను ఇద్దరు ఇంగ్లీష్ టూరిస్ట్ లు బయటపడ్డారు. ఈ ఉదంతం తర్వాత ఆ ఇంగ్లీష్ టూరిస్ట్ లు ఎక్కడా కన్పించలేదు. అయితే, ఆ సేల్స్ వుమెన్ టఫీ ఎవరో తనకు తెలియదని ప్రకటించడం గమనర్హం.