సౌరవ్ గంగూలీ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. టీమిండియా క్రికెట్ కు దూకుడు నేర్పిన కెప్టెన్. గ్రౌండ్ లోనైనా, బయటైనా.. గంగూలీ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. దేనికి భయపడే తత్వం గంగూలీది కాదు. అలాంటి దాదా కూడా ఓ సారి భయంతో వణికిపోయాడంటే మీరు నమ్ముతారా..? భయంతో జడుసుకుని పారిపోయాడన్న విషయం మీకు తెలుసా...? అవును ఇదంతా నిజం.
కొద్దిసేపటికి బాత్రూమ్లో నీళ్లు పడుతున్న సౌండ్... గంగూలీకి విన్పించింది. నల్లా బంద్ చేయడం మరిచిపోయానేమోనని లేచి లైట్లు వేసి... అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే నల్లా బంద్ చేసి ఉంది. ఏదో భ్రమ అనుకుని.. మళ్లీ నిద్ర పోవడానికి బెడ్ మీద ఎక్కాడు గంగూలీ. కానీ, కొద్ది సేపటి తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ సారి నీళ్లు ఫుల్లుగా విప్పిన శబ్దాలు... భయంతో ఉలిక్కిపడి లేచి, గంగూలీ బయటికి పరుగెత్తాడు.
క్రికెటర్ రాబిన్ సింగ్ రూమ్‌కి వెళ్లి, అక్కడే పడుకుంటానని అతణ్ని గంగూలీ అడిగాడు. అతను ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత జరిగింది తెలుసుకుని, ఆహ్వానించాడు. ఈ విషయం గంగూలీయే స్వయంగా తెలిపాడు. "దెయ్యాలు ఉన్నాయా? లేదా? అనేది నాకు తెలీదు. కానీ ఆ సంఘటనను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ గుర్తుచేసుకున్నాడు సౌరవ్ గంగూలీ.