ఇక, లేటెస్ట్ గా టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అయేషా ముఖర్జీ విడాకుల విషయాన్ని అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయేషాను ప్రేమించిన ధావన్ 2012లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2014లో కుమారుడు జొరావర్ జన్మించాడు. దాదాపు తొమ్మిది ఏళ్ల కలిసి ఉన్న తర్వాత అయేషా ఇలాంటి ప్రకటన చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఇక, క్రికెటర్ దినేశ్ కార్తీక్ తన మొదటి భార్య నికితాకి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మురళీ కార్తీక్ మిత్రద్రోహం చేయడం వల్ల దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇలా దినేశ్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళీ విజయ్, అతని మొదటి భార్య నికితాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం దినేశ్ కార్తీక్ కి తెలియడంతో నికితాకి విడాకులు ఇచ్చాడు. దినేశ్ కార్తీక్‌తో విడాకులు తీసుకున్న నికితాను పెళ్లాడిన మురళీ విజయ్‌కి ప్రస్తుతం ఓ కూతురు, ఓ బాబు ఉన్నారు