యూఏఈ, ఒమన్ వేదికగా క్రికెట్ లవర్స్ ను అలరించడానికి ధనాధన్ టోర్నీ టీ -20 ప్రపంచ కప్ ( T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయ్. అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా అభివర్ణిస్తారు. ఈ మైదానం పై కప్పు చుట్టూ 350 లైట్లు ఫిక్స్ చేశారు. ఫ్లడ్ లైట్లు బదులు ఈ ఎల్ఈడీ లైట్లనే ఉపయోగిస్తారు. ఇక, ఈ స్టేడియంలోనే అత్యధిక టీ-20 మ్యాచ్ లు జరిగాయ్. 62 టీ -20 మ్యాచుల్ని ఈ స్టేడియంలో నిర్వహించారు. 2009 లో నిర్మించిన ఈ స్టేడియంలో 20 వేల మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించవచ్చు.