సానియా మీర్జా - షోయబ్ మాలిక్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. వీరి ప్రేమకు సరిహద్దులు కూడా సరిపోలేదు. హైదరబాద్ అమ్మాయి అయిన సానియా ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్. వీరి పెళ్లిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. కానీ, వీరిద్దరూ వాటి లెక్క చేయకుండా అన్యోన్యంగా వారి బంధాన్ని కొనసాగించారు. (Photo Credit : Instagram)
సానియా , షోయబ్ లు 2010లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. ఇక, సానియా మీర్జా భారత టెన్నిస్ స్టార్. ఈ స్టార్ కున్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ తన ఆటతో, అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సానియా మీర్జా. (Photo Credit : Instagram)
ఇక, పాకిస్థాన్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది..నదియాని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాలుగు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. నదియా పబ్లిక్ లో అంతగా కన్పించకపోయినా.. పాక్ లో ఈమె క్రేజ్ సూపరో సూపర్. పబ్లిక్ గా అంతగా కన్పించకపోయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది నదియా ఆఫ్రిది. (Photo Credit : Instagram)
ఇక, పాక్ స్పీడ్ స్టార్..వసీం అక్రమ్ మొదటి భార్య హ్యూమా క్యాన్సర్ వ్యాధితో అక్టోబర్ 2013 జూలై 7న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మరణించింది. అప్పటి నుంచి అక్రమ్ ఒంటరి గానే కాలం గడిపాడు వసీం అక్రమ్. అయితే ఈ 51 ఏళ్ల ఈ మాజీ స్టార్ బౌలర్ మెల్బోర్న్ యువతి షానియేరా థాంప్సన్ ను వివాహం చేసుకున్నాడు. 2011లో షానియేరాను తొలిసారి కలిశాడు. ఆమెకు మొదట అక్రమే ప్రపోజ్ చేయడమే కాకుండా షానియేరా తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. వీరిద్దరి దాదాపు 25 ఏళ్ల వయస్సు తేడా ఉంది. ఈ ఆస్ట్రేలియన్ భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంది. (Photo Credit : Instagram)
ఇక, పాక్ స్పీడ్ స్టార్ మహ్మద్ అమీర్ నర్జీస్ కౌతన్ ను 2016 లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయ్. మనోడి ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని లండన్ లో జైలు శిక్ష అనుభవిస్తోన్న సమయంలో నర్జీస్ పరిచయం అయింది. బ్రిటీష్ సిటిజన్ అయిన నర్జీస్ ప్రేమలో మునిగి తేలాడు అమీర్. (Photo Credit : Instagram)