ఇంకా తక్కువ మంది క్రికెట్ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటారు. అయితే ఎంత గొప్పగా కెరీర్‌ను ముగించినా.. అందరికీ గొప్ప ప్రారంభం దక్కదు. వాస్తవానికి అరంగేట్రం మ్యాచ్‌ను మరుపురానిదిగా మార్చుకునే అవకాశం దక్కడం చాలా అరుదు. ఇప్పుడు ఇండియన్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలో విఫలమైన గొప్ప భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
* కపిల్ దేవ్ : మరో గ్రేట్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్. ఈ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌కి కూడా టెస్ట్ అరంగేట్రం చేదు అనుభవం మిగిల్చింది. 1978 అక్టోబర్‌లో ఫైసలాబాద్‌లో పాకిస్థాన్‌పై కపిల్ మొదటి టెస్ట్ ఆడాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 503/8 వద్ద డిక్లేర్ చేసింది. కపిల్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సమర్పించాడు. 16 ఓవర్లలో వికెట్లేమీ లేకుండానే 71 పరుగులు ఇచ్చాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కొంత మెరుగ్గా రాణించి 12 ఓవర్లలో 1/25 గణాంకాలను నమోదు చేశాడు. 1979 జులైలో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో కపిల్ తొలి ఐదు వికెట్లు సాధించాడు. ఈ దిగ్గజ క్రికెటర్ తన టెస్ట్ కెరీర్‌ను 131 మ్యాచ్‌లు, 29.64 యావరేజ్, 23 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, రెండు సార్లు 10 వికెట్ మ్యాచ్ హాల్‌తో మొత్తంగా 434 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ సమయంలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు కపిల్ పేరిటే ఉంది.
* దిలీప్ వెంగ్‌సర్కార్ : దిలీప్ వెంగ్‌సర్కార్ అత్యుత్తమ, సొగసైన బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను 1976 జనవరిలో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇదే గేమ్‌లో సురీందర్ అమర్నాథ్ తన అరంగేట్రంలో సెంచరీని సాధించాడు. సయ్యద్ కిర్మాణీకి కూడా ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. వెంగ్‌సర్కార్ ఏడు పరుగుల వద్ద రిచర్డ్ కొలింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం నాలుగు పరుగులే చేసి హెడ్లీ హోవార్త్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వెంగ్సర్కర్ 1978 డిసెంబర్లో ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై తన మొదటి టెస్ట్ సెంచరీ (157*) నమోదు చేశాడు. లార్డ్స్‌లో వరుసగా మూడు సెంచరీలు బాది తనేంటో రుజువు చేశాడు. టెస్ట్ కెరీర్‌ను 116 మ్యాచ్‌లు, 6868 పరుగులు, 42.13 యావరేజ్, 17 సెంచరీలు, 35 అర్ధసెంచరీలతో ముగించాడు.
* సచిన్ టెండూల్కర్ : ఈ రోజు వరకు క్రికెట్లో అత్యుత్తమన గణాంకాలు సచిన్ టెండూల్కర్ పేరిటే ఉన్నాయి. సచిన్ 1989 నవంబర్‌లో కరాచీలో పాకిస్థాన్‌పై టెస్ట్‌లలో అరంగేట్రం చేశాడు. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు మాత్రమే. మొదటి మ్యాచ్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్ (అరంగేట్రం), ఇమ్రాన్ ఖాన్ వంటి మేటి బౌలర్లను ఎదుర్కోవడం సవాలనే చెప్పవచ్చు.
* హర్భజన్ సింగ్ : హర్భజన్ సింగ్ కూడా టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆల్-టైమ్ టెస్ట్ వికెట్-టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 1998 మార్చిలో బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో హర్భజన్ అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు తీశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా సాధించలేదు. మూడు సంవత్సరాల తరువాత, ఆస్ట్రేలియా ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు హర్బజన్ విజృంభించాడు. మూడు టెస్ట్‌లలో 32 వికెట్లు పడగొట్టాడు. అతను 103 మ్యాచ్‌ల్లో, 417 వికెట్లతో తన కెరీర్‌ను ముగించాడు. 32.46 యావరేజ్, 25 సార్లు 5 వికెట్లు, ఐదు సార్లు 10 వికెట్లు పడగొట్టాడు.
* విరాట్ కోహ్లీ : టెండూల్కర్ మాదిరిగానే కోహ్లికి కూడా టెస్ట్ అరంగేట్రం విజయవంతం కాలేదు. అతను 2011 జూన్‌లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కేవలం నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లి ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో 15 పరుగుల వద్ద డౌన్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.