నేటి భారత జట్టులో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ భారత్‌కు ఎన్నో మ్యాచుల్లో విజయం అందించాడు. సచిన్ తర్వాత అంతటి స్థాయి ఉన్న క్రికెటర్ కోహ్లీనే. క్రికెట్‌పై ఉన్న మక్కువ వల్ల చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. రన్ మెషీన్ కూడా పెద్దగా చదువుకోలేదు. కేవలం 12 వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు విరాట్. ( Image : AP)
విజయవంతమైన ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా పేరు ముందువరుసలో ఉంటుంది. త్వరలోనే హార్దిక్ పాండ్యాకు భారత జట్టుకు కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్లోనే అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. హార్దిక్‌కి చిన్నప్పటి నుంచి చదువు మీద ఇష్టం ఉండేది కాదు. కేవలం 9 వ తరగతి మాత్రమే పాసయ్యాడు.