Team India : ఉల్లాసంగా..ఉత్సాహంగా..ఇంగ్లండ్ లో ఎంజాయ్ చేస్తోన్న టీమిండియా స్టార్ క్రికెటర్లు..

Team India : టీమిండియా (Team India) క్రికెటర్లు అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకొని వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా అనుమతి ఇచ్చింది. ఇక, WTC Final తర్వాత..ఇంగ్లండ్ సిరీస్ కు బోలెడంత గ్యాప్ వచ్చింది. ఇంగ్లండ్ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు రీఫ్రెష్ అయ్యేందుకు సరియైన సమయం దొరకడంతో..అల ఇంగ్లండ్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తమ ఫ్యామిలీస్ తో సరాదాగా గడుపుతున్నారు. ఇంగ్లండ్‌ వీధుల్లో విహరిస్తూ మధుర జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కుటుంబాలు ఒకే ఫ్రేములో ఉన్న ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.