క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 (IPL 2022) మార్చి 26 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇక, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. గత సీజన్లో ముంబై తరఫున ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే అతని కంటే చాలా మంది ఇతర బౌలర్లు ఈ క్యాష్ రీచ్ లీగ్ లో మెరుగ్గా రాణించారు.
ఐపీఎల్లో కనీసం 300 ఓవర్లు వేసిన బౌలర్ల రికార్డులను పరిశీలిస్తే.. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యంత బెస్ట్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. అతను 6.33 ఎకానమీతో మాత్రమే పరుగులు ఇచ్చాడు. ఇది మాత్రమే కాదు, 93 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ లెగ్గీ చాలా కాలం పాటు సన్ రైజర్స్ లో భాగంగా ఉన్నాడు. అయితే ప్రస్తుత సీజన్లో టైటాన్స్ తరఫున ఆడనున్నాడు.