ఈ హీరోయిన్లు స్టార్ క్రికెటర్లను గాఢంగా ప్రేమించారు..కానీ, పెళ్లి విషయంలో మాత్రం డకౌట్ అయ్యారు..

భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. క్రికెటర్లకు సినీ తారల మధ్య డేటింగ్స్, అఫైర్ల విషయం కొత్తేమీ కాదు. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమాకు ఏదో తెలియని సంబంధం ఉంది. ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. స్టార్ క్రికెటర్లను గాఢంగా ప్రేమించారు. అయితే, కొన్ని కారణాల వల్ల వీరి బంధంతో పెళ్లి కాకుండానే ముగిసింది.