ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ప్రతి ఒక్క అథ్లెట్ కల. అందుకోసం వాళ్లు ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం, ప్రతిష్టాత్మక టోర్నికి ఈ సారి కొందరు స్టార్లు దూరం కానున్నారు. కొందరు క్వాలిఫై కాకపోతే..మరికొందర్ని దురదృష్టం వెంటాడింది. మరి కొందరు స్టార్స్ వ్యక్తిగత కారణాలతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
మో ఫారా.. ఈ ప్లేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. నాలుగు సార్లు ఒలింపిక్స్ లో ఛాంపియన్ గా నిలిచిన మేటి అథ్లెట్. అయితే.. ఈ స్టార్ 19 సెకన్ల ఆలస్యం వల్ల టోక్యో ఒలింపిక్స్ కి అర్హత సాధించలేకపోయాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన 10వేల మీటర్ల ఒలంపిక్స్ అర్హత పోటీల్లో.. అతను కొద్దిలో గమ్యాన్ని చేరలేకపోయాడు. 27 నిమిషాల 28 సెకన్లలో టార్గెట్‌ను చేరుకోవాల్సి ఉండగా, మో ఫారా 27నిమిషాల 47 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. దీంతో అతను మరో సారి ఒలంపిక్స్‌లో ఐదో సారి చాంపియన్‌గా నిలవాలన్న మో పారా నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది. (Reuters)