టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఎంతమంది పతకాలు గెలుస్తారోనని భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి పెద్ద ఎత్తున భారత ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. అయితే గుజరాత్ నుంచి మొదటిసారిగా ఆరుగురు మహిళా అథ్లెట్లు విశ్వ క్రీడల్లో పాల్గొనడం ఆసక్తి కలిగిస్తోంది. 60 ఏళ్ళ గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఆరుగురు మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు ఎంపికవడం ఇదే తొలిసారి. వీరంతా ఒలిపింక్స్, పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటనున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలవేటకు దిగుతున్న ఈ ఆరుగురు ఎవరు.. వారు పోటీపడే అంశాలేమిటో ఓ లుక్కేద్దాం...(Twitter)
1. మనాపటేల్ (స్విమ్మింగ్) : మనాపటేల్.. ఈత విభాగంలో ఇండియాలోనే అత్యధిక ర్యాంకు కలిగిన క్రీడాకారిణి. హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. జాతీయ క్రీడలలో 50 మీటర్లు, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లలో బంగారుపతకం సాధించింది. స్విమ్మర్‌గా తన ఖాతాలో 735 పాయింట్లు ఉన్న మనాపటేల్ ఒలింపిక్ లో పసిడి పతకం కోసం పోటీ పడుతున్న తొలి క్రీడాకారిణిగా నిలిచింది. మనా మార్చి 18, 2000లో జన్మిచ్చింది.
2. అంకితా రైనా (టెన్నిస్) : టెన్నిస్ స్టార్ సానియామీర్జాతో కలిసి ఒలింపిక్స్‌లో టెన్నిస్ డబుల్స్ ఆడనుంది అంకితా రైనా. ఈమె టెన్నిస్‌లో ఇప్పటికే ప్రసిద్ధురాలు. టెన్నిస్‌లో ప్రపంచ 95వ ర్యాంకు సొంతం చేసుకున్న అంకితా రైనా అహ్మదాబాద్ వాసి. ఆమె ఇప్పటికే 11 సింగిల్స్, 18 డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది. అంకితారైనా వయసు 28 సంవత్సరాలు.
3. ఎలవానిల్ వలరివన్ (షూటింగ్) : ఎలవానిల్ వలరివన్ కుటుంబం తమిళనాడు చెందినప్పటికీ.. ఆమె అహ్మదాబాద్‌లోనే పుట్టింది. అహ్మదాబాద్‌లో షూటింగ్లో శిక్షణ తీసుకున్న ఈమె వివిధ పోటీలలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. 21 ఏళ్ళ ఎలవానిల్ గతంలో షూటింగ్లో ప్రపంచ నెంబర్1గా నిలిచింది. కిందటి నెలలో డిల్లీ వరల్డ్ క్లబ్లో జరిగిన పోటీలలో బంగారుపతకం గెలుచుకుంది. మనదేశం నుంచి షూటింగ్ విభాగంలో 15 మంది ఎంపిక అవ్వగా వారిలో ఈమె కూడా ఒకరు.
4. పారుల్ పర్మార్ (పారాబాడ్మింటన్) : 2009లో అర్జున అవార్డు సాధించిన పారుల్ పర్మార్ ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున పారాబాడ్మింటన్ పోటీలలో పతకం సాధించేందుకు ఉవ్విళ్ళూరుతోంది. చిన్నప్పుడే పోలియో సోకిన పర్మార్ నిరాశచెందక బ్యాడ్మింటన్ పై దృష్టిసారించింది. తన తండ్రి కూడా బ్యాడ్మింటన్ ఆటగాడు కావడంతో ఈమెకు ఈ ఆటపై మక్కువ కలిగింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లలో పారుల్ పర్మార్ గోల్డ్ మెడల్స్ సాధించింది.
5. సోనాపటేల్ (పారా టేబుల్ టెన్నిస్) : అహ్మదాబాద్‌లో పుట్టిన సోనాల్ పటేల్ దివ్యాంగురాలైనప్పటికీ టేబుల్ టెన్నిస్‌లో తన ప్రతిభచూపి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 34 ఏళ్ళ సోనాల్ టీచర్ కావాలనుకుంది. కానీ ఆ కల నెరవేరకపోవడంతో ఆటలపై దృష్టి పెట్టింది. స్థానిక స్వచ్ఛందసంస్థ, టీచర్లు, స్నేహితుల సహకారంతో పారాటేబుల్ టెన్నిస్ ఆడటం నేర్చుకున్న సోనాపటేల్ ఒలింపిక్స్‌లో తన సత్తా చూపడానికి అన్నిరకాలుగా సిద్ధమైంది.