World's Richest Athlete in Every Sport | ఆయా క్రీడల్లో వరల్డ్ రిచెస్ట్ అథ్లెట్లు వీరే.. భారత్ నుంచి కోహ్లీ ఒకే ఒక్కడు.. కింగ్ స్థానం ఎంతంటే..
World's Richest Athlete in Every Sport | ఆయా క్రీడల్లో వరల్డ్ రిచెస్ట్ అథ్లెట్లు వీరే.. భారత్ నుంచి కోహ్లీ ఒకే ఒక్కడు.. కింగ్ స్థానం ఎంతంటే..
world's highest-paid athletes : ఫోర్బ్స్ ప్రతీ ఏడాది ఈ జాబితాను ప్రకటించడం ఆనవాయితీ. ఆటగాళ్ల వార్షిక సంపాదన, ఎండార్స్మెంట్, బోనస్, స్పాన్సర్షిప్ డీల్స్, లైసెన్స్ ఇన్కమ్ ద్వారా వివరాలను వెల్లడిస్తుంటారు.
2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్ల లిస్ట్ ను ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దిగ్గజ ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ మొదటి స్థానంలో నిలిచాడు. 126.9 మిలియన్ డాలర్లను ఏడాదికి ఆర్జిస్తున్నాడు జేమ్స్.
2/ 10
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ 122 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు.(Twitter)
3/ 10
బాక్సింగ్ లో కానెలో అల్వరెజ్ 89 మిలియన్ డాలర్లతో ఈ లిస్ట్ లో ఐదో స్థానం దక్కించుకున్నాడు.
4/ 10
8-టెన్నిస్ లో రోజర్ ఫెడరర్ దే అగ్రస్థానం. ఈ స్విస్ మాస్టర్ 85.7 మిలియన్ డాలర్లతో ఈ లిస్ట్ లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.
5/ 10
ఇక, గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ 73.5 మిలియన్ డాలర్లతో ఈ లిస్టులో పదో స్థానంలో నిలిచాడు.
6/ 10
అమెరికన్ ఫుట్ బాల్ గేమ్ ప్లేయర్ మాథ్యూ స్టాఫర్డ్ 73.3 మిలియన్ డాలర్లతో 11 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.(Twitter)
7/ 10
ఫార్మూలా వన్ రేసింగ్ లో లూయిస్ హామిల్టన్ యే కింగ్. ఈ దిగ్గజం 54 మిలియన్ డాలర్లతో 19 వ స్ధానంలో నిలిచాడు.(Twitter)
8/ 10
MMA గేమ్ ప్లేయర్ కానర్ మెక్ గ్రోగర్ 52 మిలియన్ డాలర్లతో 22వ స్థానంలో నిలిచాడు.
9/ 10
ఫేమస్ బేస్ బాల్ ప్లేయర్ మైక్ ట్రౌట్ 49.5 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. 24 వ స్థానంలో నిలిచాడు ఈ బేస్ బాల్ ప్లేయర్.(Twitter)
10/ 10
ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 33.9 మిలియన్ డాలర్లతో(31 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో) 61వ స్థానంలో ఉన్నాడు. కోహ్లి తప్ప మరే భారతీయ ఆటగాడు టాప్-100లో చోటు దక్కించుకోలేకపోయారు.