ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యధిక వేతనం సంపాదించే ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డోకు పేరున్నది. రియల్ మాడ్రిడ్ నుంచి జువెంటస్ క్లబ్‌కు మారినప్పుడు దాదాపు 100 మిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. అతడికి భారీగా జీతభత్యాలు అందించారు. కానీ ఇప్పుడు రిటైర్మెంట్కు దగ్గర పడుతున్న రొనాల్డో.. ఇటీవలే జువెంటస్ నుంచి తన మొదటి క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు మారిపోయాడు. అయినా సరే గతంలో కంటే తక్కువ జీతమే అందుకుంటున్నాడు. అతడి కంటే జూనియర్లు ఎక్కువ జీతం అందుకుంటుండటం విశేషం. ప్రస్తుతం అత్యధిక క్లబ్ వేతనం పొందుతున్న టాప్ 10 ఫుట్‌బాలర్లలో రొనాల్డో 7వ స్థానంలో ఉన్నాడు. టాప్ 10 ఫుట్ బాల్ ప్లేయర్లు వారానికి ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం.