మరో ఐదు రోజుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. సమ్మర్ ఒలింపిక్స్ 2021 ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక, అథ్లెట్లందరూ టోక్యో ఒలింపిక్స్ గ్రామానికి చేరుకుంటున్నారు. పతకం నెగ్గి..తమ దేశాల జెండాల్ని రెపరెపలాడించాలని ప్రతి అథ్లెట్ ఉవ్విల్లూరుతున్నాడు. ఇక, ఈ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న జంటలపై ఓ లుక్కేద్దాం.
సు బర్డ్ మరియు మెగన్ రాపినో : గతేడాది అక్టోబర్ లో ఈ ఇద్దరూ మహిళలు పెళ్లి చేసుకున్నారు. మనసులు ఏకం కావడంతో...జెండర్ లు ఒక్కటైనా వివాహం చేసుకున్నారు సు బర్డ్ మరియు మెగన్ రాపినో. ఈ ఇద్దరు అమెరికాకు చెందిన అథ్లెట్లు. బర్డ్ అమెరికా జాతీయ బాస్కెట్ బాల్ కు ప్రాతినిథ్యం వహిస్తే.. రాపినో ఫుట్ బాల్ టీమ్ ప్లేయర్.