భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) ఇటీవలి కాలంలో గాయాల (Injuries) కారణంగా బలహీనంగా తయారవుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ (Fast Bowling) విభాగంలో గాయాలే పెద్ద మైనస్‌గా మారాయి. రీసెంట్ టైమ్స్‌లో అనేక మంది భారతీయ ఫాస్ట్ బౌలర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ సమీపిస్తున్న కొద్దీ, ఈ పేసర్ల ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది.
ముఖ్యంగా ఇంజురీ హిస్టరీ వల్ల ఐపీఎల్ టోర్నమెంట్లో ఐదుగురి టీమిండియా ఫాస్ట్ బౌలర్ల ఫుల్ పార్టిసిపేషన్ క్వశ్చన్ మార్క్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆ పేసర్ల ఫిట్నెస్ను వారు ఆడుతున్న జట్ల వైద్య సిబ్బంది పర్యవేక్షించే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్లో కనిపించే వారి ఫిట్నెస్ లెవెల్స్ నెక్స్ట్ టోర్నమెంట్ మ్యాచ్‌లలో సెలక్షన్‌కు కీలకంగా మారనున్నాయి. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం
* జస్ప్రీత్ బుమ్రా : ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఇటీవల కాలంలో వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్యం గురించి భారత జట్టు పెద్దగా సమాచారం వెల్లడించకపోవడం గమనార్హం. అతను ముంబై ఇండియన్స్ తరఫున IPL 2023లో కంబ్యాక్ ఇవ్వవచ్చు. భారత జట్టుకు అతడు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఐపీఎల్లో ఆడితే అతని ఫిట్నెస్ క్లోజ్‌గా మానిటర్ చేసే అవకాశం ఎక్కువ.
* దీపక్ చాహర్ : ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ మొత్తం IPL 2022కి దూరమయ్యాడు. తరువాత అతను కొన్ని వైట్-బాల్ గేమ్‌లలో భారతదేశం కోసం ఆడాడు. కొన్ని విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో రాజస్థాన్ తరఫున కూడా ఆడాడు, కానీ అతను ఫిట్‌గా ఉండలేకపోయాడు. అతను లిమిటెడ్-ఓవర్ క్రికెట్లో టీమ్ ఇండియాకి చాలా వాల్యుబుల్ ప్లేయర్ కాబట్టి IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడుతున్నప్పుడు, అతని ఆటతీరును నిశితంగా పరిశీలిస్తారు.
* మొహ్సిన్ ఖాన్ : యువ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ IPL 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బంతి వేగంతో ప్రత్యర్థులను వణికించాడు. తన బౌలింగ్‌లో విభిన్న నైపుణ్యాలను ప్రదర్శించాడు. దురదృష్టవశాత్తు మోకాలు పైభాగం, భుజంకి గాయం కావడంతో అతను ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దేశీయ క్రికెట్లో అతన్ని జాయిన్ చేసుకోలేదు. అయితే IPL 2023లో అతడు రీఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాతీయ జట్టులో కూడా అతడి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. కాగా మొహ్సిన్ను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రూ.20 లక్షలకు రిటైన్ చేసుకుంది.
* ప్రసిద్ధ్ కృష్ణ : ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ IPL 2022 నుంచి కేవలం 9 ఆటలలో మాత్రమే ఆడాడు. అతను భారతదేశం కొరకు ODI, ఇతర ఫార్మాట్లలో స్టార్ బౌలర్‌గా ఎదగకముందే గాయపడ్డాడు. ఈ ప్లేయర్ IPL 2023లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్లో అతను బాగా ఆడితే, 2023 ప్రపంచ కప్ జట్టులో ఆడే అవకాశం ఉంటుంది.
* ఖలీల్ అహ్మద్ : టాలెంటెడ్ లెఫ్టార్మ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కెరీర్ మొత్తంలో గాయాలతో బాధపడ్డాడు. గత సంవత్సరంలో ఎక్కువ కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్ట్రాంగ్ పర్ఫామెన్స్ చూపించాడు కానీ అతను ఫిట్‌గా ఉండలేకపోయాడు. IPL 2023లో అతని ఫిట్నెస్ను చాలా జాగ్రత్తగా పరిశీలించవచ్చు.