Cricket : IPLలో కోట్ల వర్షం.. ఇప్పుడు టీమిండియాలో స్థానం.. ఒక్క ఏడాదిలోనే ఈ ఆటగాడి రాత మారింది!
Cricket : IPLలో కోట్ల వర్షం.. ఇప్పుడు టీమిండియాలో స్థానం.. ఒక్క ఏడాదిలోనే ఈ ఆటగాడి రాత మారింది!
Cricket : బంగ్లాదేశ్ టూర్ కోసం బీసీసీఐ ఇటీవలే టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ పర్యటనలో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఆటగాడు యశ్ దయాల్‌కు అవకాశం లభించింది. ఐపీఎల్ టు టీమిండియాలో స్థానం వరకు ఈ యంగ్ ప్లేయర్ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్ (IPL) అంటేనే కాసుల వర్షం అంటారు. అయితే, ఐపీఎల్ ఎంతో మంది కుర్రాళ్లకు తమను తాము నిరూపించుకునే ఒక వేదిక. ఈ ధనాధన్ లీగ్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ లో సత్తా చాటి టీమిండియాలో స్థానం సంపాదించుకున్నారు. అలా చోటు దక్కించుకున్న ఓ యువ కెరటమే యశ్ దయాల్.
2/ 7
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు (Indian Team)ను బీసీసీఐ (BCCI) సోమవారం ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ (Yash Dayal) తొలిసారి భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.
3/ 7
24 ఏళ్ల యష్ దయాల్ ఉత్తరప్రదేశ్ తరఫున ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్ మరియు 14 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలం ద్వారా ఈ యంగ్ గన్ వెలుగులోకి వచ్చాడు. కొత్తగా వచ్చిన గుజరాత్ ఫ్రాంచైజీ యష్ దయాల్ కోసం రూ. 3.2 కోట్లకు బిడ్డింగ్ చేసి కొనుగోలు చేసింది.
4/ 7
గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడంలో యశ్ దయాళ్ కూడా కీ రోల్ ప్లే చేశాడు. కీలక సమయాల్లో వికెట్ తీసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు కూడా తీశాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు టీమిండియా జట్టులో చోటు దక్కేలా చేసింది.
5/ 7
యశ్ దయాళ్ తండ్రి చంద్రపాల్ దయాల్ కూడా క్రికెటర్. అతను రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే క్రికెట్ ఆడమని యష్‌పై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. అయితే మంచి క్రికెటర్‌గా ఎదగాలనేది చంద్రపాల్ కల. చివరగా యష్‌కి టీమిండియా నుంచి కాల్ వచ్చింది. దీంతో.. అతని తండ్రి కల నెరవేరింది.
6/ 7
ఐపీఎల్ ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లను భారత్‌కు అందించింది. ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లు ఐపీఎల్ ద్వారా టీమిండియాలో స్థానం సంపాదించారు.
7/ 7
ఇప్పుడు ఆ లిస్టులో యశ్ దయాల్ చేరాడు. ఎంతో మంది కుర్రాళ్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి.. ఇప్పుడు స్టార్ ఆటగాళ్లుగా మారారు. దీంతో..యష్ దయాళ్ మీద కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి.