ఇమ్రాన్ తాహిర్ : దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 43 ఏళ్ల వయసులోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. వయసు మీద పడుతున్నా తనలో పదును తగ్గలేదని నిరూపిస్తున్న స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. వచ్చే ఏడాది పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం కరాచీ కింగ్స్ జట్టు తమ డ్రాఫ్ట్ లో ఈ వెటరన్ ఆటగాణ్ని ఉంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడిన ఈ స్పిన్నర్ ప్లాటినం విభాగంలో (రూ. 130,000-170,000) ధరతో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో తాహిర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. (PC : AFP)
ముజీబ్ ఉర్ రెహ్మాన్ : పంజాబ్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున IPLలో ఆడిన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ను.. PSL జట్టు పెషావర్ జల్మీ జట్టు డైమండ్ కేటగిరీలో తీసుకుంది. డైమండ్ విభాగంలో ($60,000-80,000) స్థానం పొందాడు. అయితే, ఈ ఆటగాడిని 2022 మెగా వేలంలో ఏ IPL ఫ్రాంచైజీ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. (PC : AFP)
జోష్ లిటిల్ : ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తన ఫాస్ట్ బౌలింగ్‌తో క్రికెట్ విమర్శకుల్ని కూడా మెప్పించాడు ఐర్లాండ్ కు చెందిన జోష్ లిటిల్. న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ సాధించిన ఈ బౌలర్‌ను ముల్తాన్ సుల్తాన్ PSL ప్లాటినం విభాగంలో ($ 130,000-170,000) తీసుకుంది. ఐర్లాండ్ ఎడం చేతి వాటం పేసర్ జోష్ లిటిల్ను కూడా గతేడాది ఐపీఎల్లో ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే 2023 పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో మాత్రం అతన్ని ప్లాటినం విభాగంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తీసుకుంది. (PC : AFP)
రహ్మానుల్లా గుర్బాజ్ : PSL 2023 డ్రాఫ్ట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఇస్లామాబాద్ యునైటెడ్ ప్లాటినం విభాగంలో (రూ. 130,000-170,000) ఎంపిక చేసింది. ఈ యువ ప్రామిసింగ్ ప్లేయర్‌ని IPL 2022 మెగా వేలంలో ఏ జట్టు కూడా తీసుకోలేదు. అయితే జేసన్ రాయ్ ఆఖరి క్షణంలో ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో గుజరాత్ టైటాన్స్ జట్టు గుర్బాజ్‌ను తీసుకుంది. కానీ అతను ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఫర్వాలేదనిపించాడు.