MS Dhoni : భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. ధోనీ, సాక్షి సింగ్ లు 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు అతడిపై పలు డేటింగ్ రూమర్స్ వెల్లువెత్తాయి. చాలా మంది హీరోయిన్స్ తో మనోడు డేటింగ్ చేశాడన్న వార్తలు హల్ చల్ చేశాయ్. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
బాలీవుడ్ లో అడుగుపెడుతూనే సంచలనంగా మారిన దీపికా పదుకునే పై ధోనీ ఎంతో ఆసక్తి కనబర్చాడు. వీరిద్దరు కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు హల్ చల్ చేశాయ్. అయితే అదే సమయంలో యువరాజ్ కూడా సీన్ లోకి ఎంటరయి దీపిక ను తనవైపు ఎట్రాక్ట్ చేసుకున్నాడని, దీంతో ధోనీ పక్కకు తప్పుకున్నాడని చెప్పుకుంటారు. (Twitter)
ఇక, లక్ష్మీరాయ్ తో కూడా ధోనీ ఎఫైర్ నడిపినట్లు అప్పట్లో పెద్ద వార్తలే వచ్చాయ్. రిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ధోనీ కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు లక్ష్మీ రాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ధోనీనే కారణం. రెండేళ్లపాటు వారి ప్రేమ వ్యవహారం నడిచింది. తర్వాత వారిద్దరూ విడిపోయారు.(Twitter)
పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అసిన్తో కూడా ధోనీ ప్రేమాయణం నడిపించినట్టు వార్తలు వచ్చాయి. ఈ భామను ధోనీ పెళ్లి చేసుకోనున్నట్లు కూడా అప్పట్లో వార్తలు హాట్ టాపిక్ గా మారాయ్. దాదాపు రెండు దశాబ్దాలు పాటు సినిమాలు చేసిన అసిన్, ఓ వ్యాపారవేత్తను పెళ్లాడి సినిమాలకు, ఈ రూమర్లకు స్వస్తి పలికింది.(Twitter)