ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ యాష్లే బార్టీ (Ash Barty) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ (Wimbledon 2021) గెలిచిన తొలి ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కష్టపడితే అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తోందని నిరూపించింది ఈ భామ. యాష్లే బార్టీ టెన్నిస్ ప్లేయరే కాకుండా ఓ ప్రోఫెషనల్ క్రికెటర్ కూడా. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015-2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది.