ఈ రోజుల్లో చదువుకున్న ప్రాధాన్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాయ కష్టం చేసైనా సరే తమ పిల్లలకు మంచి చదువును అందించాలని ప్రతీ తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మనిషికి చదువు ఓ ప్రామాణికం అయిపోయింది. ఇక, భారతదేశంలో క్రికెట్, సినిమాకు ఉన్నంత క్రేజ్ వేటికి లేదనే చెప్పాలి. ఆట వస్తే బ్యాటు పట్టుకుని క్రికెటర్గా ఎదగాలని కల కంటారు లేదా... యాక్టింగ్ వేస్తే కెమెరా ముందుకొచ్చి హీరోగా చెలరేగిపోవాలని ఆశపడతారు. తమదైన ఆటతో కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న భారత ఆటగాళ్లలో స్టార్ భార్యల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్పై ఓ లుక్కేద్దాం. (Photo Credit : Instagram)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తన హార్డ్ వర్క్ తో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఇక, అనుష్క శర్మ.. ఆర్ట్స్ లో డిగ్రీ సంపాందిస్తే..ఎకానమిక్స్ లో మాస్టర్స్ చేసింది. కోహ్లీ మాత్రం ప్లస్ 2 తోనే తన చదువుకు స్వస్తి పలికాడు. (Photo Credit : Instagram)