Rafael Nadal : గ్రాండ్ స్లామ్స్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన క్లే కోర్ట్ కింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే?
Rafael Nadal : గ్రాండ్ స్లామ్స్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన క్లే కోర్ట్ కింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే?
Rafael Nadal : రెండో రౌండ్ పోరులో నాదల్ 6-3, 6-1, 6-4తో కొరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్)పై అలవోక విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా నాదల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
[caption id="attachment_1313604" align="alignnone" width="1600"] ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో క్లే కింగ్ రాఫెల్ నాదల్ రెచ్చిపోతున్నాడు. తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టి కోర్టుపై అలవోక విజయాలు సాధిస్తూ మూడో రౌండ్ లో ప్రవేశించాడు.
[/caption]
2/ 6
రెండో రౌండ్ పోరులో నాదల్ 6-3, 6-1, 6-4తో కొరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్)పై అలవోక విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా నాదల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
3/ 6
గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లలో పురుషుల విభాగంలో 300 మ్యాచ్ లు గెలిచిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. నాదల్ కంటే ముందుగా ఈ ఘనతను రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్ సాధించారు.
4/ 6
ప్రస్తుతానికి ఫెడరర్ 369 గ్రాండ్ స్లామ్ మ్యాచ్ విజయాలతో తొలి స్థానంలో ఉండగా.. జొకొవిచ్ 325 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత 300 విజయాలతో నాదల్ మూడో స్థానంలో ఉన్నాడు.
5/ 6
ఇక ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం నాదల్ తన హవాను కొనసాగిస్తున్నాడు. తాజా విజయంతో ఫ్రెంచ్ ఓపెన్ లో తన విజయాల రికార్డును 107కు పెంచుకున్నాడు. ఒక గ్రాండ్ స్లామ్ లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు.
6/ 6
ఈ టోర్నీ ముందు వరకు కూడా రోజర్ ఫెడరర్ ఒక గ్రాండ్ స్లామ్ లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ గా ఉన్నాడు. ఫెడరర్ వింబుల్డన్ లో 105 మ్యాచ్ ల్లో నెగ్గాడు.