సీజన్ తొలి రేసు అయిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్ శనివారం జరిగింది. ఇందులో ఫెరారీ డ్రైవర్లు సత్తా చాటారు. ఫెరారీ టీంకు రెడ్ బుల్ టీం నుంచి తీవ్ర పోటీ ఎదురైనా... క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్ లో తన కారును అద్భుతంగా నడిపిన చార్లెస్ లెక్ లెర్క్ సీజన్ లో తొలి పోల్ పొజీషన్ ను సొంతం చేసుకున్నాడు. (PC: F1 Twitter)
క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్ లో అందరికంటే ముందుగా ఒక నిమిషం 30.558 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసి చార్లెస్ లెక్ లెర్క్ పోల్ పొజిషన్ ను సొంతం చేసుకున్నాడు. చార్లెస్ లెక్ లెర్క్ కు ఇది 10వ పోల్ పొజిషన్ కావడం విశేషం. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. (PC: F1 Twitter)