అంతేకాదు మియామి గ్రాండ్ ప్రి సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో ఏకంగా తన రేసింగ్ సూట్ పై అండర్ వేర్ వేసుకొని సూపర్ మ్యాన్ లా రేసు ట్రాక్ కు వచ్చాడు. ఇక నగల విషయంలో ఏడు సార్లు చాంపియన్ లూయిస్ హామిల్టన్ నిరసన తెలిపాడు. శుక్రవారం రోజు ఒంటి నిండా జ్యూవెలరీని ధరించి రేసు ట్రాక్ పైకి వచ్చాడు.
ప్రమాదం జరిగి ఏ డ్రైవర్ అయినా మంటల్లో చిక్కుకున్నప్పడు అతడి ఒంటిపై వాచ్ లేదా నగలు ఉంటే అవి త్వరగా అంటుకొని డ్రైవర్ కు పెద్ద ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రేసింగ్ చేసే సమయంలో వీటిపై స్టీవర్డ్ నిషేధించారు. 2020 బహ్రెయిన్ జీపీలో హాస్ డ్రైవర్ రొమాన్ గ్రోస్యెన్ కు పెను ప్రమాదం జరిగింది. అతడి కారు అదుపు తప్పి సెఫ్టీ బ్యారియర్స్ ను ఢీ కొట్టాడు. దాంతో అతడు దాదాపు నిమిషం పాటు మంటల్లోనే ఉండిపోయాడు. అయితే అతడు వేసుకున్న రేసు స్యూట్ వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి కార్ల డిజైన్ లో, డ్రైవర్ భద్రత విషయంలో స్టీవర్డ్స్ చాలా సీరియస్ గా ఉంటోంది.