[caption id="attachment_1263792" align="alignnone" width="1600"] ఫార్మాలా వన్ (F1) రేసింగ్ 2022 సీజన్ లో ఫెరారీ జట్టు అదరగొడుతుంది. ఇప్పటికే సీజన్ ఓపెనింగ్ గ్రాండ్ ప్రి అయిన అబుదాబి రేసులో పోల్ పొజిషన్ తో పాటు విజయాన్ని అందుకున్న పెరారీ... తాజాగా ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిలోనూ సత్తా చాటింది. (PC: F1)
[caption id="attachment_1263794" align="alignnone" width="1080"] కరోనా వల్ల రెండేళ్ల పాటు ఎఫ్1 కు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి... తాజా సీజన్ తో మళ్లీ పునరాగమనం చేసింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్ లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్ లెర్క్ పోల్ పొజిషన్ ను సాధించాడు. అతడు ల్యాప్ ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 17.868 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసి క్వాలిఫయింగ్ లో తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా రేపు జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. (PC: F1)
[caption id="attachment_1263796" align="alignnone" width="1920"] 0.286 సెకన్లు వెనుకగా ల్యాప్ ను పూర్తి చేసిన రెడ్ బుల్ డ్రైవర్, ప్రస్తుత ప్రపంచ డ్రైవర్ చాంపియన్ మ్యాక్స్ వెర్ స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. తద్వార రేపు జరిగే ప్రధాన రేసును అతడు రెండో స్థానం నుంచి ఆరంభించనున్నాడు. మరో రెడ్ బుల్ డ్రైవర్ సెర్జియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. (PC: F1)
పలు కార్లు ప్రమాదానికి గురి కావడంతో క్వాలిఫయింగ్ సెషన్ రెండు సార్లు రెడ్ ఫ్లాగ్ తో నిలిచిపోయింది. తొలుత విలియమ్స్, ఆస్టన్ కార్లు ఢీ కొనడంతో తొలిసారి రెడ్ ఫ్లాగ్ తో సెషన్ ఆగిపోయింది. ఆ తర్వాత మూడో క్వార్టర్ లో రెండు సార్లు చాంపియన్ ఆల్పీన్ డ్రైవర్ ఫెర్నాండో కారు ప్రమాదానికి గురవ్వడంతో మరోసారి సెషన్ నిలిచిపోవాల్సి వచ్చింది. దాదాపు 200 కి.మీ పైగా వేగంతో వెళ్తూ అదుపు తప్పిన అలొన్సో బ్యారి గేడ్స్ ను ఢీ కొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. (PC: F1)